కోర్టు ముందు హీరో దిలీప్, బెయిల్ కోసం, నేడు జనప్రియనాయకన్ భవిష్యత్తు తేలిపోతుంది !
ముఖ నటి కిడ్నాప్ లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ హీరో దిలీప్ ను కేరళ పోలీసులు కొచ్చిలోని అంగమాలి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు తీసుకెళ్లారు. అంగమాలి కోర్టు దిలీప్ ను పోలీసు
కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్ లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ హీరో దిలీప్ ను కేరళ పోలీసులు కొచ్చిలోని అంగమాలి జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టుకు తీసుకెళ్లారు. అంగమాలి కోర్టు దిలీప్ ను పోలీసు కస్టడీకి ఇచ్చి 48 గంటలు పూర్తి అయ్యింది.
శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో దిలీప్ ను కోర్టు ముందు హాజరుపరచాలని అంగమాలి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కేరళ పోలీసులు విచారణ పూర్తి చేసి దిలీప్ ను కోర్టులో హాజరపరచడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

భారీ బందోబస్తు
దిలీప్ ను కోర్టులో హాజరుపరుస్తున్నారని తెలుసుకున్న ఆయన అభిమానులు పెద్ద ఎత్తున కోర్టు ముందు గుమికూడటంతో పోలీసులు గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. దిలీప్ అభిమానులు అత్యుత్సాహం చూపించకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు.

దిలీప్ ప్రమేయం ఉంది !
నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో దిలీప్ ప్రమేయం ఉందని పోలీసులు అంటున్నారు. నటిని కిడ్నాప్ చేసి లైంగిక దాడి చెయ్యడానికి ప్రధాన నిందితుడు సునీల్ కుమార్ అలియాస్ పల్సర్ సునీకి హీరో దిలీప్ రూ. 1.50 కోట్లు ఎరవేశాడని పోలీసులు ఆరోపిస్తున్నారు.

దిలీప్ కు నిరసన సెగ
నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో అరెస్టు అయిన మాలీవుడ్ హీరో దిలీప్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే దిలీప్ ను కోర్టు ముందు హాజరుపరచడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చెయ్యడంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో దిలీప్ కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చెయ్యడానికి పలు మహిళా సంఘాలు సిద్దం అయ్యాయి.

బెయిల్ పిటీషన్ విచారణ
దిలీప్ కు బెయిల్ మంజూరు చెయ్యాలని ఆయన న్యాయవాది రామ్ కుమార్ కోర్టులో అర్జీ సమర్పించారు. శుక్రవారం అర్జీ విచారణ చేస్తామని కోర్టు చెప్పింది. శుక్రవారం తనను కోర్టు ముందు హాజరుపరుస్తున్న సమయంలో స్వయంగా దిలీప్ బెయిల్ మంజూరు చెయ్యాలని కోర్టులో మనవి చెయ్యడానికి సిద్దం అయ్యారు.

పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేశన్ ఉంటే !
నటిని కిడ్నాప్ చేసి దారుణంగా లైంగిక దాడి చెయ్యడానికి కిరాయి ఇచ్చాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న దిలీప్ కు బెయిల్ మంజూరు చెయ్యరాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేశన్ అడ్డుకునే అవకాశం ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేశన్ కు ఎన్నో క్రిమినల్ కేసులు వాదించిన అనుభవం ఉంది.

పోలీసుల అభ్యంతరం
ఎంతో పలుకుబడి ఉన్న దిలీప్ కు బెయిల్ మంజూరు చేస్తే సాక్షాలు నాశనం చేసే అవకాశం ఉందని ఇప్పటికే పోలీసులు కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు. సురేశన్ ముందు దిలీప్ న్యాయవాది రామ్ కుమార్ ఆటలు సాగవని న్యాయనిపుణులు అంటున్నారు.

జనప్రియనాయకన్ వస్తాడని ?
మా హీరో జనప్రియనాయకన్ దిలీప్ బెయిల్ మీద బయటకు వస్తాడని ఆల్ కేరళ దిలీప్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు అంటున్నారు. దిలీప్ జైలు నుంచి బయటకు రావాలని శుక్రవారం కేరళలోని పలు ప్రాంతాల్లో పూజలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే పోలీసులు దిలీప్ కు వ్యతిరేకంగా బలమైన సాక్షాలు సేకరించడంతో ఆయనకు బెయిల్ మంజూరు అయ్యే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications