Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మాట మార్చిన ప్రధాన సాక్షి.. కీలక మలుపు తిరిగిన మలయాళ నటి లైంగిక వేధింపుల కేసు

ఫిబ్రవరిలో కొచ్చిలో నటిని అపహరించి లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. సదరు నటి షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఆమె కారును పల్సర్‌ సుని, అతడి అనుచరులు అడ్డగించారు.

కేరళ: మలయాళ నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో ఓ కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సాక్షి హఠాత్తుగా తన వాంగ్మూలాన్ని మార్చేశారు. కేసులో ప్రధాన నిందితులు పల్సర్‌ సుని, విజేశ్‌లు.. నటుడు దిలీప్ భార్య కావ్య కార్యాలయమైన లక్ష్యా కు రావడం ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రధాన సాక్షి మాట మార్చడంతో ఈ కేసు దర్యాప్తు పోలీసులకు మరింత క్లిష్టంగా మారింది.

Recommended Video

    Dileep Always Tried To Take Revenge on that Actress | Filmibeat Telugu

    ఫిబ్రవరిలో కొచ్చిలో నటిని అపహరించి లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. సదరు నటి షూటింగ్‌ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా ఆమె కారును పల్సర్‌ సుని, అతడి అనుచరులు అడ్డగించారు. కారులో నటిని లైంగికంగా వేధించి, ఫొటోలు చిత్రీకరించి.. పరారయ్యారు.

    Malayalam Actress Abduction Case: Sudden Twist, Prime Witness changed the Statement

    ఆ నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత గొడవల నేపథ్యంలో మలయాళం స్టార్‌ హీరో దిలీప్‌.. ఆ నటిపై ఈ దారుణానికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు పోలీసులు దిలీప్‌ను అరెస్టు చేయడం, ఇటీవల ఆయన బెయిల్‌పై బయటకు రావడం జరిగాయి.

    దిలీప్‌ భార్య కావ్యను కూడా పోలీసులు విచారించారు. దిలీప్‌ బెయిలుపై బయటకు వస్తే తన పలుకుబడి ఉపయోగించి కేసును తప్పుదారి పట్టించే అవకాశాలు ఉన్నాయని బాధితురాలి తరఫు న్యాయవాది న్యాయస్థానానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో దిలీప్‌ బెయిలు పిటిషన్‌ను కోర్టు పలుమార్లు తిరస్కరించింది. చివరికి దిలీప్ కు బెయిల్ మంజూరు చేసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+