ఆ ఒక్క నిమిషం మైండ్ బ్లాంక్.. మాల్‌లో నటికి లైంగిక వేధింపులు.. అసభ్యంగా తాకి...
కుటుంబ సభ్యులతో కలిసి ఓ మాల్‌కి వెళ్లిన మలయాళ నటికి చేదు అనుభవం ఎదురైంది. ఇద్దరు వ్యక్తులు ఆమెను అసభ్యంగా తాకి వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది. తన పట్ల ఇంత నీచంగా వ్యవహరించినవారి చెంప పగలగొట్టలేకపోయానన్న నిస్సహాయత తనను వెంటాడుతున్నట్లు చెప్పింది. ఆడపిల్లగా బతకడమంటే ప్రతీ క్షణం ఒక సవాల్‌గా మారిందని అభిప్రాయపడింది. కొచ్చిలో జరిగిన ఈ ఘటనపై స్పందించిన కేరళ మహిళా కమిషన్ దీన్ని సుమోటో కేసుగా స్వీకరించింది.

ఒక్క నిమిషం మైండ్ బ్లాంక్...
'కుటుంబ సభ్యులతో కలిసి మా ఇంటి సమీపంలో ఉన్న లులు హైపర్ మార్కెట్‌కి వెళ్లాను. మాల్‌లో వస్తువులు తీసుకుంటుండగా ఇద్దరు వ్యక్తులు నాకు సమీపం నుంచి వెళ్లారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి చేయి నా వెనుక భాగంపై తగిలింది. ఉద్దేశపూర్వకంగానే అతనలా చేశాడు. దీంతో ఒక నిమిషం పాటు నేను బ్లాంక్ అయిపోయాను. ఇంతలో నా సోదరి వచ్చి అంతా ఓకెనా అని అడిగింది. ఏం చెప్పాలో తెలియలేదు. అతను నన్నలా తాకడం దూరం నుంచి నా సోదరి కూడా చూసింది. ఉద్దేశపూర్వకంగానే అతనలా చేసినట్లు ఆమెకు కూడా అనిపించింది.' అని సదరు నటి సోషల్ మీడియాలో వెల్లడించింది.

చెంప పగలగొట్టలేకపోయానన్న బాధ...
'ఆ తర్వాత వెజిటేబుల్ కౌంటర్ వద్దకు వెళ్లగా... అదే ఇద్దరు వ్యక్తులు మళ్లీ అక్కడికి వచ్చారు. నేను నటిస్తున్న సినిమాల గురించి అడగాడు. మాట్లాడుతూనే పైపైకి వచ్చాడు. దీంతో మైండ్ యువర్ బిజినెస్ అని చెప్పి అక్కడినుంచి వెనుదిరిగాను. ఇంతలో మా అమ్మ అటువైపు రాగా.. ఆ ఇద్దరూ అక్కడినుంచి జారుకున్నారు.' అని ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆ ఇద్దరి చెంప పగలగొట్టనందుకు,వారిని కనీసం ఏమీ అనలేకపోయినందుకు తనలో తానే బాధపడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.

సుమోటో కేసు...
కేరళ మహిళా కమిషన్ ఛైర్మన్ ఎంసీ జోసెఫిన్ ఈ ఘటనను సుమోటో కేసుగా స్వీకరిస్తున్నట్లు తెలిపారు. శనివారం(డిసెంబర్ 19) ఆ నటి నుంచి ఆధారాలు సేకరించనున్నట్లు చెప్పారు.కేరళ పోలీసులు కూడా ఈ ఘటనపై సుమోటో కేసు నమోదు చేశారు. నెటిజన్లు కూడా ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. మహిళల పట్ల అసభ్యంగా వ్యవహరించేవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
-
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..!












Click it and Unblock the Notifications