Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మలయాళం నటి డాక్టర్ ప్రియా గుండెపోటుతో చనిపోయింది. ప్రియా 8 నెలల గర్బవతి

తిరువనంతపురం: మలయాళం టీవీ నటి రెంజూషా మీనన్ అనుమానాస్పద స్థితిలో చనిపోయిన రెండు రోజుల తర్వాత మలయాళ టీవీ నటి డాక్టర్ ప్రియా గుండెపోటుతో మృతి చెందింది. మలయాళం నటి ప్రియా 8 నెలల గర్భవతి. డాక్టర్ అయిన ప్రియా చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లి అక్కడే మరణించింది. డాక్టర్ ప్రియాకు కేవలం 35 ఏళ్లు మాత్రమే.

ఎనిమిది నెలల గర్భిణిగా ఉన్న ప్రియా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఇటీవల గుండెపోటుతో బాధపడే ముందు డాక్టర్ ప్రియా ఆసుపత్రిలో రెగ్యులర్ ప్రెగ్నెన్సీ చెకప్‌లు చేయించుకుంది. అదృష్టవశాత్తూ కడుపులో ఉన్న చిన్నారి ప్రాణాలతో బయటపడింది. ప్రియా బిడ్డ ప్రస్తుతం ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో (ఐసీయూ)లో ఉంది.

Malayalam TV serial actress Doctor Priya dies of heart attack. Priya is currently 8 months pregnant.

ఈ షాకింగ్ వార్తను మలయాళం నటుడు కిశోర్ సత్య అతని అభిమానులతో పంచుకోవడానికి సోషల్ మీడియా ఖాతాలో ఈ పోస్టు చెయ్యడంతో డాక్టర్ ప్రియా చనిపోయిన విషయం వెలుగు చూసింది. మలయాళం టీవీ రంగంలో మరో విషాదం నెలకొందని. నిన్న గుండెపోటుతో డాక్టర్ ప్రియా మరణించారని, ఆమె 8 నెలల గర్భిణి అని, ప్రియా పాప ఐసీయూలో ఉందని, బిడ్డకు ఇతర ఆరోగ్య సమస్యలు ఏమీ లేవు అని నటుడు కిశోర్ సత్య సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు.

తనను నమ్ముకున్న అమాయకపు మనసులపై దేవుడు ఎందుకు ఈ క్రూరత్వాన్ని ప్రదర్శించాడు. మనసు పదే పదే ప్రశ్నలను, సమాధానం లేని ప్రశ్నలను చెబుతూనే ఉంటుంది. రంజూషా మరణ వార్త బయటకు వచ్చిన వెంటనే రెండు రోజుల తరువాత కేవలం 35 ఏళ్లు నిండిన మరో నటి డాక్టర్ ప్రియా ఈ లోకాన్ని విడిచిపెట్టిందని, ప్రియా భర్త, ఆమె తల్లిని ఓదార్చడం ఎవరి వల్లకావడంలేదని, వారిద్దు ఎలా కొలుకుంటారో అనే భయంగా ఉందని మలయాళం నటుడు కిశోర్ సత్య విచారం వ్యక్తం చేశాడు.

Malayalam TV serial actress Doctor Priya dies of heart attack. Priya is currently 8 months pregnant.

ప్రియా కుటుంబ సభ్యులు ఈ షాక్ నుంచి త్వరగా కోలుకోవడానికి ఆ దేవుడు వారికి శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నానని నటుడు కిశోర్ సత్య పోస్టు చేశాడు. డాక్టర్ ప్రియా మలయాళం టీవీ సీరియల్స్ లో నటించి బుల్లితెర నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత నటనకు దూరంగా ఉంటున్న డాక్టర్ ప్రియా ప్రస్తుతం MD చదువుతోందని తెలిసింది.

తిరువనంతపురంలోని పీఆర్ఎస్ ఆసుపత్రిలో డాక్టర్ ప్రియా వైద్యురాలిగా పనిచేస్తోంది. మలయాళం నటి రెంజూషా మీనన్ సోమవారం తిరువనంతపురంలోని ఆమె ఫ్లాట్‌లో శవమై కనిపించింది. 35 ఏళ్ల నటి అయిన రెంజూషా మీనన్ ఆమె భర్త మనోజ్‌తో కలిసి అపార్ట్ మెంట్ లో నివసిస్తోంది, నివాసం ఉంటున్న ఫ్లాట్‌లో రెంజూషా మీనన్ ఉరి వేసుకున్న స్థితిలో శవమై కనిపించింది. రెంజూషా మీనన్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు మలయాళం మీడియాకు చెందిన కొన్ని పత్రికలు, టీవీ చానల్స్ అంటున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+