నటిపై లైంగిక దాడి: గుట్టు విప్పిన సునీ, కావ్య మెడకు ఉచ్చు
మలయాళ నటిపై లైంగిక దాడి కేసులో మరో నటి కావ్యా మాధవన్ మెడకు ఉచ్చు బిగిస్తోంది. ప్రధాన నిందితుడు పల్సర్ సునీ తాజాగా ఈ కేసుకు సంబంధించిన గుట్టు విప్పే పలు విషయాలు బయటపెట్టాడు.
కొచ్చి: మలయాళ నటిపై లైంగిక దాడి కేసులో మరో నటి కావ్యా మాధవన్ మెడకు ఉచ్చు బిగిస్తోంది. ప్రధాన నిందితుడు పల్సర్ సునీ తాజాగా ఈ కేసుకు సంబంధించిన గుట్టు విప్పే పలు విషయాలు బయటపెట్టాడు. మేడం నుంచి అందిన ఆదేశాల మేరకే తాను నటిని కారులో లైంగిక వేధించినట్లు తెలిపాడు.
మలయాళ నటిని వేధించి, బ్లాక్ మెయిల్ చేసేందుకు ఫొటోలు, వీడియోలు తీసినట్లు చెప్పాడు. తనకు ఆదేశాలు ఇచ్చిన మేడమ్ సినీ పరిశ్రమకు చెందినవారేనని చెప్పాడు. ఈ నేరం చేసేందుకు డబ్బులు సమకూర్చింది కూడా ఆమెనే అని తెలిపాడు.
డబ్బు సమకూర్చారు తప్ప ఆమె నేరంలో ప్రత్యక్షంగా పాలు పంచుకోలేదని అతను చెప్పినట్లు సమాచారం. అయితే, ఆ మేడమ్ ఎవరనేది స్పష్టంగా తెలియడం లేదు.

మేడమ్ ఎవరు....
ఆ మేడమ్ పేరును పల్సర్ సునీ విచారణాధికారులకు చెప్పలేదని అంటున్నారు. దీంతో ఆమె ఎవరనేది ఆసక్తికరంగా మారింది. ఆమె పేరు, వివరాలు మాత్రం చెప్పలేదని అంటున్నారు. ఆయితే, ఆమె హీరో దిలీప్ రెండో భార్య కావ్యా మాధవన్ అయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video


ఎవరో తెలియదు..
పల్సర్ సునీ ఎవరో తనకు తెలియదని కావ్యా మాధవన్ అంటున్నారు. అయితే, ఆమె వ్యాఖ్యలను సునీ తోసిపుచ్చాడు. తానెవరో తెలియదని కావ్య అనడం మూర్ఖత్వమని అన్నాడు. ఆమెకు తాను బాగా తెలుసునని అతను మీడియాతో చెప్పాడు.

వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికే...
నటిపై వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి హీరో దిలీప్ పల్సర్ సునీతో ఆమెపై ఆ అఘాయిత్యం చేయించాడనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఈ వ్యవహారంలో దిలీప్ సూత్రధారి కాగా, ఆయన భార్య కావ్యా మాధవన్ కూడా పాలు పంచుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

లైంగిక దాడికి
ప్రముఖ మలయాళీ నటిపై కారులో లైంగిక దాడికి యత్నించిన ఘటన తీవ్ర సంచలనం రేపిన విషయం తెలిసిందే. పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసు దర్యాప్తు సాగించారు. పల్సర్ సునీ అరెస్టుతో పలు సంచలన విషయాలు వెలుగులో వస్తున్నాయి.












Click it and Unblock the Notifications