• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రముఖ మోడల్, మలయాళి కుట్టి మిస్సింగ్: చెన్నైలో పట్టపగలు, ఆ ఫ్రెండ్ ఎవరు !

|

చెన్నై: ప్రముఖ మోడల్, స్క్రీన్ ప్లే రైటర్ గానమ్ నాయర్ (28) మిస్సింగ్ కేసు మిస్టరీగా మారిందని, ఆమె కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని చెన్నైలోని కేకే నగర్ మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పారు. కనీసం గానమ్ నాయర్ స్కూటర్ కూడా కనిపించడం లేదని పోలీసులు అంటున్నారు.

ఇంటి నుంచి బయటకు వెళ్లిన గానమ్ నాయర్ కోసం తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ లో చెన్నై నగర పోలీసులు గాలిస్తున్నారు. కేరళకు చెందిన గామన్ నాయర్ మోడల్ గా పని చేస్తున్నారు. ఓ ప్రైవేటు టీవీ చానల్ లో స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేస్తూ చెన్నైలో నివాసం ఉంటున్నారు.

ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తా !

ఫ్రెండ్ ఇంటికి వెళ్లి వస్తా !

ఈనెల 26వ తేదీన ఉదయం విరుంబాక్కంలోని కార్యాలయం నుంచి నలుపు రంగు ఆక్టీవా నెంబర్ (TN 09 BU 5199) స్కూటర్ లో ఇంటి నుంచి బయలుదేరారు. నుంగంబాక్కంలోని ఫ్రెండ్ ఇంటికి వెలుతున్నానని, త్వరగా వస్తానని బంధువులకు చెప్పి వెళ్లింది.

తిరిగి రాలేదు, మొబైల్ ఫోన్ !

తిరిగి రాలేదు, మొబైల్ ఫోన్ !

ఇంటి నుంచి బయటకు వెళ్లిన గానమ్ నాయర్ తిరిగి రాలేదని, తరువాత ఆమె ఆచూకి లేదని కుటుంబ సభ్యులు చెన్నై నగరంలోని కేకే నగర్ మహిళా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు.గానమ్ నాయర్ మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయ్యిందని కేకే నగర్ మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది అన్నారు.

మొబైల్ ఫోన్ కాల్ రికార్డు

మొబైల్ ఫోన్ కాల్ రికార్డు

గానమ్ నాయర్ మొబైల్ ఫోన్ కాల్ రికార్డును పరిశీలిస్తున్నామని పోలీసులు చెప్పారు. గానమ్ నాయర్ స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని, నుంగంబాక్కంలోని ఫెండ్ర్ ఎవరు ? అని ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఢిల్లీలో ఆందోళన !

ఢిల్లీలో ఆందోళన !

గానమ్ తండ్రి ఢిల్లీలో నివాసం ఉంటున్నారు. కూతురు కనిపించడం లేదని తెలిసిన వెంటనే ఆయన తీవ్రఆందోళన చెందుతున్నారని పోలీసులు అంటున్నారు. గానమ్ కలవడానికి వెళ్లిన నుంగంబాక్కంలోని ఫ్రెండ్ వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు అన్నారు.

గానమ్ కు ఫోన్ చేశారా ఆమె వెళ్లారా

గానమ్ నాయర్ ఆచూకి కనిపెట్టేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని కేకే నగర మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. గానమ్ నాయర్ కు ఎవరైనా ఫోన్ చేసి పిలిచారా ? లేక ఈమె ఎవరికైనా ఫోన్ చేసి తాను వస్తున్నానని చెప్పారా ? అంటూ చెన్నై పోలీసులు ఆరా తీస్తున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Malayali Model Ganam Nair went missing on 26th morning when travelling to her office from Virugambakkam to Nungambakkam in BLACK ACTIVA (TN 09 BU 5199). She did not reach office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more