ఛీఛీ దుర్మార్గుడు: చికిత్స కోసం వస్తే కన్నేశాడు.. పేషెంట్ మత్తులో ఉండగానే...!

గురుగ్రాం: గురుగ్రాంలో మరో కామాంధుడు తన వెకిలి చేష్టలను బయటపెట్టాడు. హాస్పిటల్‌కు చికిత్స కోసం వచ్చిన పేషెంట్‌పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. ఆ కామాంధుడు మరెవరో కాదు.. అదే హాస్పిటల్‌లో మేల్ నర్స్‌గా పనిచేస్తున్నాడు. సుశాంత్ లోక్-1 ప్రాంతంలో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌ ఉంది. అందులో గత ఏడాదిగా మేల్‌ నర్సుగా పనిచేస్తున్నాడు ఈ దుర్మార్గుడు.

మంగళవారం రోజున సర్జరీ కోసం ఓ 40 ఏళ్ల మహిళ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యింది. అయితే బుధవారం తెల్లవారుజామున ఒంటిగంట సమయంలో ఈ కామాంధుడు ఆమె ఉంటున్న గదిలోకి నక్కాడు. ఆమెను లైంగికంగా వేధించసాగాడు. ఈ విషయం ఆమె తన భర్తకు తెలియజేసింది. వెంటనే ఆయన హాస్పిటల్ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చాడు. ఆ తర్వాత యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది.

Male nurse arrested for molesting sedated woman patient in Gurugram hospital

సర్జరీ చేయించుకుని వచ్చిన తర్వాత మహిళపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆమె ఇంకా మత్తునుంచి పూర్తిగా తేరుకోకముందే ఆమెను తాకరాని చోట నిందితుడు తాకాడని పోలీసులు చెప్పారు. ఇదే విషయం పేషెంట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచామని చెప్పిన పోలీసులు ఆ తర్వాత నిందితుడికి బెయిల్ మంజూరు అయినట్లు చెప్పారు.

బుధవారం సాయంత్రం పేషెంట్ భర్త హాస్పిటల్ ఘటన గురించి యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చినట్లు మేనేజ్‌మెంట్ వివరించింది. తన భార్యతో మేల్ నర్స్ అసభ్యకరంగా ప్రవర్తించిందని తమ దృష్టికి తీసుకొచ్చినట్లు యాజమాన్యం తెలిపింది. వెంటనే ఓ కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేసి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లు చెప్పారు. జరిగింది నిజమే అని తెలియడంతో ఆవ్యక్తిని ఉద్యోగంలో నుంచి తొలగించి గురువారం ఉదయం 8 గంటలకు పోలీసులకు అప్పగించినట్లు యాజమాన్యం వివరించింది. నిందితుడిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 354 ఏ కింద కేసును నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+