Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మిని స్కర్ట్ రాధే మా, మల్లికా షెరావత్‌తో సినిమా!

ముంబై: ఆధ్యాత్మిక దేవత (గాడ్ వూమెన్) రాధే మా జీవిత చరిత్ర ఆదారంగా హిందీతో పాటు దక్షిణాది భాషలలో సినిమా తియ్యడానికి రంగం సిద్ధం అయ్యింది. పలు వివాదాలలో చిక్కుకున్న రాధే మాకు బాలీవుడ్ లో అనేక మంది తారలు భక్తులుగా ఉన్నారు.

బాలీవుడ్ నిర్మాత రంజిత్ శర్మ రాధే మా జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో సినిమా తీస్తున్నానని గురువారం ప్రకటించారు. ఇదే విషయం జూమ్ చానెల్ కు చెప్పారు. ఆ సినిమాలో బహుబాషా నటి, సెక్స్ బాంబ్ మల్లికా షరావత్ కీలకపాత్రలో నటిస్తారని ఆయన ప్రకటించారు. బాలీవుడ్ లో ఈ విషయంపై వాడి వేడిగా చర్చ జరుగుతున్నది.

అయితే ఈ విషయంపై మల్లికా షరవాత్ స్పందించారు. తాను రాధే మా క్యారెక్టర్ లో నటించడం లేదని ట్విట్ చేశారు. తనను ఇంత వరకు ఏ నిర్మాత సంప్రదించలేదని స్పష్టం చేశారు. బాలీవుడ్ నటి డాలి బింద్రా రాధే మా మీద ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Mallika Sherawat as Radhe Maa in Bollywood Film ?

ఈ ఫిర్యాదు చేసిన కొన్ని గంటలలోనే రాధే మా పై సినిమా తియ్యడానికి నిర్మాత సిద్దం అయ్యారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ జోద్ పూర్ జైలులో 72 గంటలు ఎలా గడిపాడు అంటు 2006లో ఇదే నిర్మాత రంజిత్ శర్మ ఒక సినిమా తీశారు. ఇప్పుడు రాధే మా జీవిత చరిత్ర తీస్తానని జూమ్ చానెల్ కు చెప్పాడు.

నీలి చిత్రాలలో నటించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని బాలివుడ్ లో అడుగు పెట్టిన సన్నీ లియోన్ ఇటివల మీడియాతో మాట్లాడుతూ తాను రాధే మా భక్తురాలు అని బహిరంగంగా చెప్పింది. ఇటివల రాధే మాకు సెక్స్ బాంబ్ రాఖీ సావంత్ సైతం మద్దతు పలికింది.

శుక్రవారం వరకట్నం వేందిపుల కేసులో ముంబై పోలీసులు రాధే మాను విచారణ చెయ్యడానికి సిద్దం అయ్యారు. ఇప్పటికే ఆమెకు సమన్లు ఇచ్చారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా మిని స్కర్ట్ రాధే మా గురించే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+