డర్టీ పాలిటిక్స్: నడుంకు జెండా, మల్లికా శరావత్‌పై కేసు
హైదరాబాద్: జాతీయ జెండాను అవమానించినందుకు బాలీవుడ్ నటి, ఐటమ్ గర్ల్ మల్లికా శరావత్ పైన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఫలక్ నుమా పోలీసులు కేసు నమోదు చేశారు. డర్టీ పాలిటిక్స్ సినిమాలో మల్లికా శరావత్ జాతీయ జెండాను నడుపుకు చుట్టుకొని అవమానించిందని ఈ ఫిర్యాదు చేశారు.
జెండాను నడుముకు చుట్టుకొని అవమానించిందని, ఆమె పైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫలక్‌నుమాకు చెందిన సమీయుద్దీన్, ఖదీర్‌లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

నాంపల్లి 16వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ నటి మల్లికా శరవాత్, డర్టీ పాలిటిక్స్ చిత్ర నిర్మాత పైన కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. బుధవారం ఫలకు నుమా పోలీసులు వారిద్దరి పైన కేసు నమోదు చేశారు. దర్యాఫ్తును కొనసాగిస్తున్నారు.












Click it and Unblock the Notifications