1న జైట్లీని కలిసిన మాల్యా: 'ఎవరికీ ఇంటర్యూ ఇవ్వలేదు'
న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ అధినేత విజయ్ మాల్యా దేశం నుంచి పారిపోవడానికి ముందు రోజు అంటే మార్చి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కలిశారని ఏఐసీసీ ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా ఆరోపించారు. జైట్లీ, మాల్యా ఎందుకు సమావేశమయ్యారన్ని విషయంపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ సమావేశం గురించి ప్రధాని నరేంద్ర మోదీకి తెలుసుంటే ఆయన కూడా పార్లమెంట్ కు వివరణ ఇవ్వాలని అన్నారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న కేసులో నిందితుడిగా ఉన్న విజయ్ మాల్యాను తిరిగి దేశంలోకి తీసుకురాలేకుంటే, ఈ కేసు కూడా ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోడీ కేసులా మారిపోతుందని సుర్జేవాలా హెచ్చరించారు.
Also Read: సైకిల్ నుంచి కింగ్ ఫిషర్ దాకా: ఎవరీ విజయ్ మాల్యా?
దేశం విడిచి పారిపోయేందుకు విజయ్ మాల్యాకు బీజేపీ పెద్దలు సహకరించారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దేశంలోని వివిధ బ్యాంకులకు విజయ్ మాల్యా 9 వేల కోట్ల రూపాయలు ఎగవేసిన సంగతి తెలిసిందే. కాగా విజయ్ మాల్యా లండన్‌లోని ఉన్న సంగతి తెలిసిందే.

అయితే తాను సండే గార్డియన్‌కు ఇంటర్యూ ఇచ్చినట్లు వస్తున్న వార్తలను విజయ్ మాల్యా ఖండించారు. తాను సండే గార్డియన్‌తో పాటు ఏ మీడియా సంస్ధకు ఎలాంటి ఇంటర్యూలు ఇవ్వలేదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తన ప్రోటాన్‌మెయిల్ అకౌంటు నుంచి వాళ్ల రిపోర్టర్‌కు మెయిల్ చేశానని సండే గార్డియన్ చెప్పడం చూసి తాను షాకయ్యానని మాల్యా ట్వీట్ చశారు.
అసలు ఇప్పటివరకు తాను ప్రోటాన్‌మెయిల్ అనే ఈమెయిల్ గురించి విననే లేదని చెప్పారు. తనకు ప్రోటాన్‌మెయిల్ ఈమెయిల్ అకౌంట్ లేదని స్పష్టం చేశారు. తాను వాళ్ల రిపోర్టర్లకు ఈమెయిల్ ఇంటర్వ్యూ ఇచ్చానని సండే గార్డియన్ పత్రిక చెప్పడం మొత్తం తప్పేనని ఆయన స్పష్టం చేశారు.
తాను ఇప్పట్లో భారతదేశానికి రావడం అంత సేఫ్ కాదని, అందువల్ల కొన్నాళ్ల పాటు విదేశాల్లోనే ఉంటానని ఆయన చెప్పినట్లుగా సండే గార్డియన్ ఇంటర్వ్యూలో ప్రచురించడం, దాన్ని వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన సంగతి తెలిసిందే.
Shocked to see Sunday Guardian's claim that I exchanged mails with them from my protonmail account. Have never heard of protonmail before.
— Vijay Mallya (@TheVijayMallya) 14 March 2016
Never ever had nor do I have a protonmail e-mail account. As I said earlier I have never ever heard of protonmail.
— Vijay Mallya (@TheVijayMallya) 14 March 2016
Sunday Guardian's claim that I wrote to them from my so called protonmail account to the reporters protonmail account is a total fake.
— Vijay Mallya (@TheVijayMallya) 14 March 2016












Click it and Unblock the Notifications