10వ తరగతి విద్యార్థినిపై అత్యాచారయత్నం, కేకలు వేసిందని చంపేసిన కిరాతకుడు!

బెంగళూరు: పెళ్లికి నిరాకరించిందని విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసి దారుణంగా హత్య చేశాడు ఓ కిరాతకుడు. ఉన్నత చదువులు చదివి తమకు అండగా ఉంటుందని ఆశించిన బాలిక కుటుంబ సభ్యులకు చివరి విషాదం మిగిలింది.

10వ తరగతి

10వ తరగతి

కర్ణాటకలోని కోలారు జిల్లా, మాలూరు పట్టణంలో నివాసం ఉంటున్న బాలిక (15) స్థానికంగా ఉంటున్న పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నది. బాలిక ఇంటి సమీపంలో నివాసం ఉంటున్న రంజిత్ అనే యువకుడు భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్నాడు.

ఉన్నత చదువులు

ఉన్నత చదువులు

నిత్యం బాలిక వెంటపడి తనను వివాహం చేసుకోవాలని రంజిత్ వేధింపులకు గురిచేశాడు. అయితే తాను ఉన్నత చదువులు చదివి కుటుంబ సభ్యులు చూసించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని బాలిక రంజిత్ కు చెప్పింది.

బాలిక వెంటపడ్డాడు

బాలిక వెంటపడ్డాడు

రంజిత్ మాత్రం నిత్యం బాలిక వెంటపడుతూ పెళ్లి చేసుకోవాలని వేధించాడు. ఆగస్టు 1వ తేదీన బాలిక పాఠశాల నుంచి ఇంటికి బయలుదేరింది. బాలిక వెంటపడిన రంజిత్ తనను పెళ్లి చేసుకోవాలని వేధించాడు. తాను కచ్చితంగా పెళ్లి చేసుకోనని బాలిక చెప్పింది.

కేకలు వేసిన బాలిక

కేకలు వేసిన బాలిక

బాలిక కుటుంబ సభ్యులు అందరూ బయటకుపోవడంతో ఆమె మాత్రం ఇంటిలో ఉంది. విషయం గమనించిన రంజిత్ బాలిక ఇంటిలోకి వెళ్లాడు. బాలిక మీద అత్యాచారం చెయ్యడానికి ప్రయత్నించాడు. బాలిక కేకలు వెయ్యడంతో రంజిత్ ఆందోళన చెందాడు.

రైల్వే స్టేషన్ లో మకాం

రైల్వే స్టేషన్ లో మకాం

స్థానికులు వచ్చి పట్టుకుంటారని ఆందోళన చెందిన రంజిత్ ఆమెను హత్య చేశాడు. బాలికను హత్య చేసిన రంజిత్ పరారైనాడు. గురు, శుక్రవారం రాత్రులు మాలూరు రైల్వేస్టేషన్ కు వెళ్లిన రంజిత్ అక్కడే నిద్రపోయాడు. రాత్రి గస్తీ తిరుగుతున్న పోలీసులు రంజిత్ ను గమనించి అతన్ని విచారణ చేశారు.

నేను హత్య చేసి వచ్చాను

నేను హత్య చేసి వచ్చాను

బాలికను హత్య చేసి ఇక్కడికి వచ్చానని రంజిత్ అంగీకరించాడు. పోలీసులు రంజిత్ ను అరెస్టు చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు. బాలికను హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని మాలూరులో వందలాది మంది విద్యార్థులు ధర్నా నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+