విపక్ష కూటమిలో చీలిక ? మమతపై రాహుల్ విమర్శలు, వీరి మధ్య దూరానికి కారణమిదేనా ?

మాల్దా : విపక్ష కూటమిలోని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై రాహుల్‌గాంధీ విమర్శించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె, ప్రధాని మోదీ వ్యవహారశైలి ఒకేవిధంగా ఉంటుందని పోల్చారు. ఎన్నికల వేళ విపక్ష కూటమిలోని ప్రధాన రాజకీయ పార్టీ అధినేత్రిని టార్గెట్ చేయడం సర్వత్రా చర్చానీయాంశమైంది. దీంతో విపక్షాల మధ్య చీలిక వచ్చిందనే అనుమానాలకు బలం చేకూరినట్లైంది. శనివారం పశ్చిమబెంగాల్‌లోని మల్దాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాహుల్ గాంధీ.

మాటలే .. చేతలేవీ ?

మాటలే .. చేతలేవీ ?


మమతా హామీలు ఇబ్బడి ముబ్బడిగా గుప్పిస్తారు, కానీ ఆచరణలో మాత్రం కార్యరూపం దాల్చదు అని విమర్శించారు రాహుల్‌గాంధీ. 'మీకు ఉద్యోగం లభించిందా అని మల్దా యువతను ఉద్దేశించి ప్రశ్నించారు. రైతులను ప్రభుత్వం ఆదుకున్నాదా అని అడిగారు. ఈ రాష్ట్రంలోని ప్రజలపై ఓ చేతితో నరేంద్రమోదీ, మరో చేతితో మమతా బెనర్జీ హామీలిచ్చారు. కానీ ఆ హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారు‘ అని విమర్శించారు.

పార్టీ మారింది ? మరి అభివ‌ృద్ధి

పార్టీ మారింది ? మరి అభివ‌ృద్ధి

బెంగాల్‌లో గత కొన్నేళ్లుగా సీపీఎం అధికారంలో ఉన్నది, ఆ ప్రభుత్వం ఏం చేయడం లేదని మీరు మమతా బెనర్జీకి అధికారం కట్టబెట్టారు. కానీ ఇక్కడి ప్రభుత్వం మాత్రం పార్టీ కోసం పనిచేస్తోంది. ఇవాళ ఓ వ్యక్తి కోసం పాటుపడుతుందని మాటల తూటాలు పేల్చారు.

దీదీ, మోదీ ఒక్కటే

దీదీ, మోదీ ఒక్కటే

ప్రధాని మోదీకి మమతా బెనర్జీకి సారూప్యత ఉన్నదని పోల్చారు రాహుల్. వీరిద్దరూ నేతలు ఆచరణ అమలు కానీ హామీలిచ్చి ప్రజలను మోసం చేస్తారని దుయ్యబట్టారు. వీరిద్దరూ నేతలు ప్రజలను మభ్యపెడుతూ మోసం చేస్తూనే ఉంటారని .. కళ్లబొల్లి కబుర్లతో కాలం వెళ్లదీస్తారని మండిపడ్డారు.

రాహుల్ స్వరం ఎందుకు మారిందంటే ?

రాహుల్ స్వరం ఎందుకు మారిందంటే ?

ఎన్నికలకు ముందు కోల్ కతాలో మమతా చేపట్టిన ర్యాలీలో కాంగ్రెస్ ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే సీబీఐ ఇష్యూలో మోదీ వైఖరిని ఎండడగడుతూ రాహుల్ మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇంతలో రాహుల్ స్వరం మారడానికి కారణం ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. మోదీని గద్దెదింపేందుకు విపక్షాలన్నీ ఒక్కటయ్యాయి. విపక్ష పార్టీలన్నీ సోనియాగాంధీ నాయకత్వాన్ని సమర్థించారు. రాహుల్‌గాంధీని నాయకుడిగా అంగీకరించలేదు. ముఖ్యంగా మమతా బెనర్జీ బాహాటంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కూటమిలో అంటిముట్టనట్టుగానే వీరిద్దరూ ఉన్నారు. కానీ వారిలోని లుకలుకలు మాల్దా బహిరంగ సభతో బహిర్గతమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+