మమత డైరెక్ట్ అటాక్- నిరవధిక ధర్నా
తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్డెక్కారు. కోల్ కతలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. నిరవధిక ధర్నాకు శ్రీకారం చుట్టారు. అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేంద్ర ప్రభుత్వంతో నేరుగా రాజకీయ ఘర్షణకు దిగినట్టయింది. అటు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుసరిస్తోన్న వైఖరినీ తప్పుపట్టినట్టయింది.
కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటర్ల సవరణ (SIR)ను వ్యతిరేకిస్తూ ఆమె ఈ ఆందోళనకు దిగారు. కోల్ కత ఎస్ ప్లానెడ్ ఈస్ట్ ప్రాంతంలో చేపట్టిన ఈ నిరవధిక ధర్నాలో పలువురు మంత్రులు, తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ కార్యకలాపాల్లో ఓ రాజకీయ పార్టీ జోక్యం చేసుకోవడాన్ని మమత బెనర్జీ తప్పుపట్టారు. ప్రజాస్వామ్య సంస్థలను ఇది బలహీనపరిచిందని, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరులో జోక్యం చేసుకోవడమే దీని ఉద్దేశమని ధ్వజమెత్తారు.

ఈ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ప్రజలు ఎప్పటికీ అంగీకరించబోరని మమత స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థలను కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటోందని మండిపడ్డారు. సమాఖ్య సూత్రాలను దెబ్బతీసే చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ ఆందోళన పశ్చిమ బెంగాల్ కు మాత్రమే పరిమితం కాబోదని, దేశవ్యాప్తంగా మద్దతును కూడగట్టుకుంటామని హెచ్చరించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలలో జోక్యం చేసుకునే ప్రయత్నాలను దేశ ప్రజలు సహించబోరని అన్నారు.
మమత బెనర్జీకి మద్దతుగా పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. దీంతో నిరసన ప్రాంతంలో అంతా జనసమ్మర్థమైంది. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్రాఫిక్ నిర్వహణ, శాంతిభద్రతల పర్యవేక్షణకు కోల్‌కతా పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించారు. ఈ ధర్నాకు వ్యతిరేకంగా ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ ఆందోళనకు దిగే అవకాశం ఉండటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సర్ ను వ్యతిరేకిస్తూ ఏకంగా ముఖ్యమంత్రే నిరవధిక ధర్నాకు దిగడం పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రాబోయే ఎన్నికల సమరానికి ముందు రాజకీయాలపై ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని అంచనా. బీజేపీ దీన్ని ఎన్నికల స్టంట్ గా విమర్శిస్తోంది. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే మమత బెనర్జీ ధర్నా పేరుతో డ్రామాకు తెర తీశారని మండిపడుతోంది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications