రథయాత్ర అంటే ఆమెకు భయం...ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు: అమిత్ షా
కోల్ కతా: వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ పై నిప్పులు చెరిగారు బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా. వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ రథ యాత్రకు అనుమతి నిరాకరించడంతో ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు కమలదళాధిపతి అమిత్ షా. మమతా బెనర్జీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ స్టేచర్ రాష్ట్రంలో పెరిగిపోతుండటంతో ఆమెకు భయం పట్టుకుందని అన్నారు అమిత్ షా.
బెంగాల్‌లో రథ యాత్ర నిర్వహించరాదంటూ అందుకు నిరాకరిస్తూ మమత సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను సవాల్ చేస్తూ బీజేపీ కోర్టును ఆశ్రయించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్నే కోర్టు సమర్థించింది. రథ యాత్ర నిర్వహిస్తే శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మూడు చోట్ల రథయాత్రకు ప్లాన్ చేసింది కమలం పార్టీ. ఇందులో కూచ్ బెహార్‌తో పాటు ప్రధాన పార్లమెంటరీ స్థానాలను రథయాత్రను కవర్ చేయాలని కమలనాథులు భావించారు. ఈ రథయాత్ర ద్వారా రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసి 2019 లోక్‌సభ ఎన్నికల్లో గట్టి పోటీని ఇవ్వాలని భావించారు కమలనాథులు.

రాష్ట్రంలో రథయాత్రలు నిర్వహించరాదని కోర్టు తెలపడంతో నిరాశలోకి వెళ్లిపోయాయి బీజేపీ శ్రేణులు. 2014 నుంచి తాను బెంగాల్‌లో 23 సార్లు వచ్చానని.. ఎక్కడా మతఘర్షణలు చోటుచేసుకోలేదని చెప్పారు. తాము వెళ్లిపోయాక జరిగిన అల్లర్లకు సంబంధం లేదని అది పోలీసులు తృణమూల్ కాంగ్రెస్ మధ్య జరిగిన అల్లర్లని అన్నారు.
దీనికి సంబంధించిన అన్ని రికార్డులు హైకోర్టు ముందుంచుతామన్నారు అమిత్ షా. మతఘర్షణలు జరుగుతాయని ముందే ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. రథ యాత్రను ఆపితే ఆమెకు ఎలాంటి లాభం చేకూరకపోగా... ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని షా అన్నారు. మమతా బెనర్జీ బీజేపీకి ప్రతి విషయంలో అడ్డు తగులుతున్నారని ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని చెబుతోంది బీజేపీ. ఆమెకు ప్రజలే గట్టిగా బుద్ధి చెబుతారని వెల్లడించింది.
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications