వారెవ్వా క్యాబాత్ హై: అతిథులకు స్వయంగా భోజనం వడ్డించిన మమతా బెనర్జీ..ఫోటో వైరల్

కోల్ కతా : సాధారణంగా రాజకీయ నాయకుల జీవితం గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. తెరముందు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే పొలిటీషియన్స్ తెరవెనక వారి జీవితం ఎలాంటిదో తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే కొందరు రాజకీయనాయకుల చుట్టూ ఉండే భద్రతాబలగాల నుంచి సమాచారం పొందుతారు. మరికొందరు సోషల్ మీడియాలో వారిని ఫాలో అవుతూ తెలుసుకుంటారు. ఇంకొందరేమో ఇతరత్రా వర్గాల నుంచి సమాచారం పొందుతారు. ఇక శనివారం కోల్ ‌కతాలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన విపక్షాల మెగా ర్యాలీలో నేతలు ప్రసంగాలతో విరుచుకుపడ్డారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

 ఐక్యత ర్యాలీకి హాజరైన బీజేపేయేతర నేతలు

ఐక్యత ర్యాలీకి హాజరైన బీజేపేయేతర నేతలు

శనివారం బీజేపీయేతర పార్టీలు, పార్టీ అధినేతలు మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన మెగా ర్యాలీకి హాజరయ్యారు. అక్కడికి వచ్చిన నేతలంతా మోడీపై ఎన్డీఏ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. ప్రతి ఒక్కరు కనీసం 10 నిమిషాల సమయం మాట్లాడి అందులో 8 నిమిషాలు మోడీపైనే విమర్శలు చేశారు. అనంతరం అలసిపోయిన నేతలకు మమతా బెనర్జీ విందు ఏర్పాటు చేశారు.

విందు భోజనం ఏర్పాటు చేసిన మమతా

విందు భోజనం ఏర్పాటు చేసిన మమతా

అసలే అది పశ్చిమ బెంగాల్. షడ్రుచులకు బెంగాల్ పెట్టింది పేరు. సభకు దేశనలుమూలల నుంచి నాయకులు నేతలు హాజరయ్యారు. మరి దీదీ అతిథి మర్యాదలు మామూలుగా ఉండవు కదా. సభకు హాజరైన నాయకులకు మమతా బెనర్జీ మంచి విందు భోజనం ఏర్పాటు చేశారు. తన రాష్ట్రానికి వచ్చిన అతిథులకు స్వయంగా మమతా దీదీనే వడ్డించడం ఇక్కడ ప్రత్యేకించి మాట్లాడుకోవాలి.

విందు భోజనం స్వయంగా వడ్డించిన దీదీ

విందు భోజనం స్వయంగా వడ్డించిన దీదీ

సాధారణంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక ముఖ్యమంత్రి అనే విషయం పక్కనబెడితే ఆమె వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి అని ఆమెను దగ్గర నుంచి చూసిన వ్యక్తులు చెబుతుంటారు. ఇక తన రాష్ట్రానికి అతిథులుగా వచ్చిన వారికి మమతా బెనర్జీ విందు భోజనం సందర్భంగా స్వయంగా వడ్డిస్తున్న ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది. హార్దిక్ పటేల్‌కు ప్రేమతో వడ్డిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక్కడ చాలా మంది నేతలు కనిపిస్తున్నారు. ఇందులో జిగ్నేష్ మెవానీ, తేజస్వీ యాదవ్, శతృఘ్న సిన్హా, చంద్రబాబు నాయుడు, స్టాలిన్, శరద్ పవార్, శరద్ యాదవ్‌లు భోజనానికి హాజరయ్యారు. అందరూ కలిసి భోజనం చేస్తున్న ఈ ఫోటో చూస్తే నిజంగానే అంతా కలిసి ఉన్నారనే భావన కలిగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+