Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టెక్కీలకు శుభవార్త! ఇన్ఫోసిస్‌లో వెయ్యి ఉద్యోగాలు, ట్రంప్‌ను ప్రసన్నం చేసుకునేందుకా?

న్యూఢిల్లీ: దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్కీలకు శుభవార్త చెప్పింది. త్వరలోనే ఓ టెక్ హబ్‌ను అమెరికాలో ప్రారంభించబోతోంది. అమెరికాలోని హార్ట్‌ఫోర్డ్ కనెక్టికట్‌లో టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌ను ప్రారంభించబోతున్నట్లు, 2022 నాటికి వెయ్యి మంది అమెరికన్ టెక్ వర్కర్లను నియమించుకోనున్నట్లు గురువారం ఇన్ఫోసిస్ ప్రకటించింది.

అమెరికా వర్కర్ల నుంచి ఉద్యోగాలను అక్రమంగా తన్నుకుపోతున్నాయంటూ అవుట్‌సోర్సింగ్‌ సంస్థలపై డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవుట్‌సోర్సింగ్‌ సంస్థలపై నిబంధనలను కూడా ట్రంప్‌ కఠినతరం చేస్తున్నారు. దీంతో అవుట్‌సోర్సింగ్‌ సంస్థలన్నీ స్థానిక నియామకాలపై దృష్టి సారించాయి.

ఈ నేపథ్యంలోనే ఇన్ఫోసిస్ కూడా అవసరమైన చర్యలు తీసుకుంటోంది. అమెరికాలో పలు టెక్ హబ్‌లు ఏర్పాటు చేసి వచ్చే రెండేళ్లలో 10 వేలమంది అమెరికన్ టెక్కీలకు ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ఇన్ఫోసిస్ గత ఏడాది ప్రకటించిన సంగతి తెలిసిందే.

Mammoth Infosys jobs drive to create 1,000 jobs for Americans to woo Donald Trump admin

ఈ మేరకు ఇన్ఫోసిస్ ఇప్పటికే తన తొలి టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ హబ్‌ను ఇండియానాలో ప్రారంభించింది. నార్త్‌ కారోలినాలో మరో హబ్‌ను, రోడ్‌ ఐల్యాండ్లో కూడా డిజైన్‌, ఇన్నోవేషన్‌ హబ్‌ను కూడా ఇన్ఫోసిస్‌ ప్రకటించింది. ప్రస్తుతం కనెక్టికట్‌లో ఏర్పాటు చేయబోతున్నది రెండో టెక్నాలజీ హబ్‌.

కనెక్టికట్‌లో ఏర్పాటుచేయబోయే హబ్‌లో ఇన్సూరెన్స్‌, హెల్త్‌కేర్‌, మాన్యుఫాక్చరింగ్‌లపై ప్రత్యేకంగా దృష్టిసారించనున్నట్టు ఇన్ఫోసిస్‌ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. కనెక్టికట్‌లో తమ ఉనికి విస్తరిస్తున్నట్టు ప్రకటించడం ఆనందదాయకంగా ఉందని, రాష్ట్రంలో దాదాపు వెయ్యి టెక్నాలజీ ఉద్యోగాలను కల్పించనున్నామని ఇన్ఫోసిస్‌ ప్రెసిడెంట్‌ రవి కుమార్‌ తెలిపారు.

న్యూ ఇంగ్లాండ్‌ ప్రాంతం వారీగా క్లయింట్లకు తమ సేవలందించడానికి తమ పెట్టుబడులను మరింత బలోపేతం చేయాల్సి ఉందన్నారు. స్థానిక వర్క్‌ఫోర్స్‌ను కూడా విస్తరించాలనుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+