దావూద్ ఇబ్రహీం ఉగ్రవాది కాదు - ముంబై పేలుళ్లు చేయలేదన్న బాలీవుడ్ నటి !!

బాలీవుడ్ మాజీ నటి, ప్రస్తుత సన్యాసిని మమతా కులకర్ణి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. గోరఖ్‌పూర్ పర్యటనలో ఆమె చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. తన మూడు రోజుల ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా విలేకరుల సమావేశంలో మమతా మాట్లాడుతూ.. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముంబై పేలుళ్లకు పాల్పడలేదని, అతడు ఉగ్రవాది కాదని పేర్కొన్నారు.

గతంలో దావూద్ ఇబ్రహీం గ్యాంగ్‌లో కీలక సభ్యుడైన విక్కీ గోస్వామితో మమతకు సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయని వార్తలు ప్రచారమయ్యాయి. విక్కీ డ్రగ్స్ వ్యాపారంలో ఆమెకు భాగస్వామ్యం ఉందని.. అతడిని వివాహం చేసుకుందని కూడా ఊహాగానాలు వచ్చాయి. ఈ ఆరోపణలను మమత తీవ్రంగా ఖండించారు. అయితే అవన్నీ అసత్యాలని కొట్టిపారేశారు.

mamta-kulkarni-controversial-comments-dawood-ibrahim

సినీ కెరీర్..

ఒకప్పుడు మమతా కులకర్ణి సినిమా పరిశ్రమలో అగ్రతారగా వెలుగొందారు. 'కరణ్ అర్జున్', 'దిల్‌బర్', 'క్రాంతివీర్', 'సబ్‌సే బడా ఖిలాడి', 'కిస్మత్', 'నజీబ్' వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో కూడా 'ప్రేమ శిఖరం', 'దొంగ పోలీస్' చిత్రాల్లో కథానాయికగా నటించి మెప్పించారు.

కానీ తనకు ప్రస్తుతం రాజకీయాలు లేదా సినిమా పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. పూర్తిగా ఆధ్యాత్మికతకు అంకితభావంతో ఉన్నానని.. సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తిగా జాతి వ్యతిరేక శక్తులతో సంబంధాలు అసాధ్యమని పేర్కొన్నారు. అయితే దావూద్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

విమర్శల నేపథ్యంలో.. మమత మరోసారి స్పందిస్తూ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. తాను దావూద్ ఇబ్రహీం గురించి కాదు, విక్కీ గోస్వామి గురించి మాట్లాడుతున్నానని.. దావూద్ నిజంగా ఉగ్రవాది అని ఆమె చెప్పుకొచ్చారు.

కాగా మమత కులకర్ణి ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన మహాకుంభమేళాలో సన్యాసం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఈ మహామేళాలో ఆమె మహామండలేశ్వర్‌గా మారినట్లు ప్రకటించారు. ఆధ్యాత్మిక బాటలో పయనించాలని నిర్ణయించుకున్న ఆమె ఫిబ్రవరి వరకు కుంభమేళాలో పాల్గొన్నారు.

జనవరి 24న, కిన్నార్ అఖారాలో ఆచార్య మహామండలేశ్వర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాస దీక్ష స్వీకరించారు. తన పేరును శ్రీ యామై మమత నందగిరిగా మార్చుకున్నారు. కాషాయ దుస్తులు ధరించి, మెడలో రుద్రాక్షలు, భుజానికి వేలాడుతున్న కుంకుమపువ్వుతో ఆమె నిజమైన సాధ్విగా మారిపోయారు. దాదాపు 25 ఏళ్ల తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చిన ఆమె, సాధ్విగా మారడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+