Mamta Kulkarni: మమతా కులకర్ణి రాజీనామా తిరస్కరణ

Mamta Kulkarni: 90వ దశకంలో బోల్డ్ నటి మమతా కులకర్ణి అకస్మాత్తుగా సినీ ప్రపంచానికి వీడ్కోలు పలికి భక్తి మునిగిపోయింది. ప్రజలు దీనిని నమ్మలేకపోయారు. కానీ జనవరి 24న ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో కిన్నార్ అఖాడా మహామండలేశ్వర్ హోదాలో కనిపించారు. కిన్నార్ అఖాడా మహామండలేశ్వర్ హోదాకు మమతా కులకర్ణి ఇటీవల చేసిన రాజీనామా తిరస్కరణకు గురైంది. ఈ విషయాన్ని మమతా కులకర్ణి ఓ వీడియోలో వెల్లడించారు. జనవరి 24న మమతా కులకర్ణి ప్రాపంచిక జీవనాన్ని పరిత్యజించి సన్యాసినిగా మారింది. కుంభమేళాలోని కిన్నార్ అఖాడాలో ఆమెకు "మాయీ మమతానంద్ గిరి"గా నామకరణం చేశారు. అత్యున్నత స్థానమైన మహా మండలేశ్వర్ హోదాను కట్టబెట్టారు.

అఖాడాలో చేరిన వెంటనే ఆమె అత్యున్నత స్థానమైన మహా మండలేశ్వర్ హోదాను పొందడం పట్ల సభ్యుల్లో పలువురు వ్యతిరేకించారు. దీంతో ఆమెపై బహిష్కరణ వేటు పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాను రాజీనామా చేసినట్లు ఫిబ్రవరి 10న మమతా కులకర్ణి ప్రకటించారు. తాను సన్యాసినిగానే కొనసాగుతానని ఆమె చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో మమతా కులకర్ణి మరో వీడియోను తాజాగా విడుదల చేశారు. మహామండలేశ్వర్ గా తన రాజీనామా ఆమోదం పొందలేదని ప్రకటించారు. ఆచార్య లక్ష్మీనారాయణ తనను ఆ హోదాలో ఉంచినందుకు కృతజ్ఞురాలిని అంటూ వీడియోలో వెల్లడించారు. తొలుత భావోద్వేగంతో తన హోదాకు రాజీనామా చేసినట్లు.. తర్వాత గురువుల మార్గదర్శకత్వంలో సనాతన ధర్మానికి సేవ చేసుకునేందుకు నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మమతా కులకర్ణి ఆ హోదాలోని కొనసాగుతారని అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ్ త్రిపాఠీ వెల్లడించారు.

Mamta Kulkarni s Resignation Rejected Updates on Her Spiritual Journey and Controversial Appointment
90వ దశకంలో బాలీవుడ్ హీరోయిన్ గా మంచి క్రేజ్ సంపాదించుకుని 2003 తర్వాత సినిమాల నుంచి వైదొలిగి మమతా కులకర్ణి విదేశాలకు వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఆమె పేరు డ్రగ్స్ రాకెట్లలో కూడా వినిపించింది. పోలీసులు నోటీసులు కూడా పంపారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కుంభమేళా సందర్భంగా భారత్ కు వచ్చి ఆమె అందర్నీఆశ్చర్యపరుస్తూ సన్యాసిగా అఖాడా కనిపించడంతో పాటు మహా మండలేశ్వర్ గా నియామకం కావడం చర్చనీయాంశమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+