అమ్మాయిపైలపై వరుస రేప్‌లు: బీహార్‌లో అరెస్టు

పోలీసుల కథనం ప్రకారం - తుగ్లక్‌బాద్‌లో భార్యతో కలిసి ఆజాద్ ఖాన్ నివసిస్తున్నాడు. స్థానిక సంస్థలో అతను కార్మికుడిగా పనిచేస్తున్నాడు. స్థానిక బాలికలకు తినుబండారాలు ఆశ చూపి వారిని బుజ్జగించి మభ్య పెట్టి తన వెంట తీసుకుని వెళ్లేవాడు. వారిని తుగ్లక్‌బాద్ అటవీ ప్రాంతంలోకి తీసుకుని వెళ్లి వారిపై అత్యాచారం చేసేవాడు.
అతనిపై బాలికల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు ఏడు నెలలుగా ఆజాద్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. చివరకు గత వారం సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారంనాడు తెలిపారు.
డిసెంబర్ 4వ తేదీన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రతి బాలికపై జరిగిన అత్యాచారం ఒకే విధంగా ఉండడంతో నేరానికి పాల్పడుతున్నది ఒకే వ్యక్తి అనే నిర్ధారణకు పోలీసులు వచ్చి దర్యాప్తును సాగించారు. ఫోన్ ఆధారంగా పోలీసులు అతని ఆచూకీని కనిపెట్టారు.












Click it and Unblock the Notifications