భార్యను చంపి.. ఆమె తలతో వీధుల్లో తిరిగాడు(వీడియో)
పుణె: కట్టుకున్న భార్యను అతి దారుణంగా చంపేశాడో దుర్మార్గపు భర్త. అంతేగాక, ఆమె తలను చేతిలో పట్టుకుని వీధుల్లో తిరిగాడు. తీవ్ర భయాందోళనకు గురిచేసే ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కత్రాజ్ ప్రాంతానికి చెందిన రాము చవాన్(53) అనే వ్యక్తి తన భార్యను గొడ్డలితో నరికి చంపాడు. గొడ్డలితో సహా, రక్తం కారుతున్న ఆమె తలను పట్టుకుని వీధుల్లో తిరిగాడు.

ఈ ఘటనను చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారమందుకున్న పోలీసులు రాము చవాన్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. భారతి విద్యాపీఠ్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై కేసు నమోదు చేశారు.
నిందితుడిని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే రాము చవాన్ తన భార్యను ఎందుకు చంపాడన్న విషయం తెలియరాలేదు.












Click it and Unblock the Notifications