రెండో భార్య అని చెప్పుకుంటూ.. కన్న కూతురుపై రేప్
చెన్నై: తమిళనాడులోని మధురైలో జరిగిన ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సొంత కూతురికే తాళి కట్టి తన రెండోవ భార్యగా చెప్పుకుంటూ.. మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్న ఓ దుర్మార్గుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తన 12 ఏళ్ల కూతురిపై ఓ తండ్రి గత ఆరు నెలలకుపైగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. అతని దారుణంపై ఫిర్యాదు చేసేందుకు భార్య సైతం ధైర్యం చేయలేకపోయింది. విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానని బయపెట్టాడు.

ఈ క్రమంలో ఆమెను చిత్రహింసలకు గురిచేసేవాడు. విషయాన్ని గమనించిన ఇరుగుపొరుగువారు చైల్డ్ లైన్ సంరక్షణ అధికారులకు సమాచారం అందించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. దీంతో ఆ బాలికకు భార్య అని చెప్పుకుంటున్న దుర్మార్గుడి నుంచి విముక్తి కలిగింది.












Click it and Unblock the Notifications