విమానంలో క్రూ మెంబర్‌తో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి అరెస్టు
న్యూఢిల్లీ: ఎయిర్ విస్తారా విమానంలో క్రూ మెంబర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్టు చేశారు. ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది.
విమానం ఢిల్లీ విమానాశ్రయంలోని టర్మినల్ 3 వద్ద ఆగి, ప్రయాణికులు దిగుతున్న సమయంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ సంఘటనపై ఎయిర్ విస్తారా ఓ ప్రకటన విడుదల చేసింది.

లక్నో - ఢిల్లీ విమానంలో మార్చి 24వ తేదీన ఓ ప్రయాణికుడు క్యాబిన్ క్రూ మెంబర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆ ప్రకటనలో తెలిపింది. సిబ్బంది, ఇతర ప్రయాణికుల భద్రతకు హాని కలింగించే అసభ్యకరమైన, నియమవిరుద్ధమైన ప్రయాణికుల ప్రవర్తనను విస్తారా సహించబోదని, అలాగే రాజీ పడబోదని వివరించింది.
కొన్ని నెలల క్రితం ఎయిర్ విస్తారా విమానంలోనే బాలీవుడ్ నటి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ - ముంబై విమానంలో సహ ప్రయాణికుడు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆ నటి ఆరోపించింది.
ఆ సంఘటనపై నటికి ఎయిర్ వస్తారా క్షమాపణలు చెప్పింది. సంఘటనపై విచారణ జరుపుతున్నట్లు కూడా తెలిపింది.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications