కంపెనీ బాత్ రూంలో యువతి స్నానం చేస్తుంటే స్మార్ట్ ఫోన్ లో వీడియోలు, సాటి ఉద్యోగి చర్మం తీసి !

చెన్నై/ నాగర్ కోవిల్: యువతి స్నానం చేస్తుంటే రహస్యంగా స్మార్ట్ మొబైల్ ఫోన్ లో వీడియోలు తీసి ఆమె జీవితంతో చాలగాటం ఆడుకోవాలని ప్రయత్నించాడు సాటి ఉద్యోగి. ఉద్యోగం చేస్తున్న కంపెనీలో తనకు భద్రత ఉంటుందని ఇంత కాలం ఆ యువతి అనుకుంది. యువతి నగ్న వీడియోలు తీసిన యువకుడు అడ్డంగా చిక్కిపోవడంతో సాటి ఉద్యోగులు అతనికి దేహశుద్ది చేసి అతని చర్మం వొలిచేశారు. డ్రైవర్ అయిన ఆ యువకుడు కంపెనీ బాత్ రూంల దగ్గర మకాం వేసి ఇంకా ఎంత మంది మహిళా ఉద్యోగుల నగ్న వీడియోలు తీశాడు అంటూ పోలీసులు ఆరా తీస్తున్నారు.

 ప్రముఖ కంపెనీలో ఉద్యోగం

ప్రముఖ కంపెనీలో ఉద్యోగం

తమిళనాడులోని కన్యాకుమరి జిల్లాలోని నాగర్ కోవిల్ లోని ఎరుమ్ బూక్కాట్ లోని ఓ ప్రముఖ కంపెనీలో 21 ఏళ్ల యువతి ఉద్యోగం చేస్తున్నది. ప్రముఖ పేరు ఉన్న కంపెనీ కావడంతో అక్కడ అనేక మంది మహిళా ఉద్యోగులు పని చేస్తున్నారు. కంపెనీలో చాల కాలం నుంచి ఆ యువతి ఉన్నత ఉద్యోగం చేస్తున్నది.

 స్నానం చెయ్యడానికి వెళ్లిన యువతి

స్నానం చెయ్యడానికి వెళ్లిన యువతి

యువతి ఉద్యోగం చేస్తున్న కంపెనీలో రాజాక్కమంగళం పూచ్చివిభాగమ్ ప్రాంతానికి చెందిన ముత్తురామన్ (30) డ్రైవర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం యువతి అలసిపోయి ఉద్యోగం చేస్తున్న కంపెనీలోని వాష్ రూం (బాత్ రూం)లో స్నానం చెయ్యడానికి వెళ్లింది.

 మొబైల్ ఫోన్ లో వీడియోలు

మొబైల్ ఫోన్ లో వీడియోలు

యువతి స్నానం చెయ్యడానికి బాత్ రూంలోకి వెలుతున్న సమయంలో అదను కోసం డ్రైవర్ ముత్తురామన్ వేచి చూశాడు. యువతి బాత్ రూంలో స్నానం చేస్తున్న సమయంలో జోబులో నుంచి స్మార్ట్ ఫోన్ బయటకు తీసిన డ్రైవర్ ముత్తురామన్ గుట్టుచప్పుడు కాకుండా యువతి నగ్న వీడియోలు తీశాడు.

 చితకబాది చర్మం తీసిన సాటి ఉద్యోగులు

చితకబాది చర్మం తీసిన సాటి ఉద్యోగులు

చప్పుడు కావడంతో యువతి బాత్ రూంలోని కిటికీ పక్కకు చూసింది. ఆ సమయంలో ముత్తురామన్ మొబైల్ లో వీడియోలు తీస్తున్న విషయం గుర్తించిన యువతి గట్టిగా కేకలు వేసింది. విషయం గుర్తించిన సాటి ఉద్యోగులు వెంటనే బాత్ రూం దగ్గరకు చేరుకుని అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించిన ముత్తురామన్ ను పట్టుకున్నారు. యువతి జరిగిన విషయం చెప్పడంతో సాటి ఉద్యోగులు డ్రైవర్ ముత్తురామన్ ను పట్టుకుని చితకబాది అతని చర్మం వొలిచి పోలీసులకు అప్పగించారు.

 ఇంకా ఎంత మంది మహిళలు ?

ఇంకా ఎంత మంది మహిళలు ?

యుతి స్నానం చేస్తున్న సమయంలో వీడియోలు తీసిన ముత్తురామన్ మొబైల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం చేస్తున్న కంపెనీలో డ్రైవర్ ముత్తురామన్ ఇంకా ఎంత మంది మహిళా ఉద్యోగులు నగ్న ఫోటోలు, వీడియోలు తీశాడు అని ఆరా తీస్తున్నామని, నిందితుడిపై కేసు నమోదు చేశామని నాగర్ కోవిల్ పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+