లోదుస్తుల్లో లక్షల డాలర్ల కట్టలు: యువకుడి అరెస్టు
చెన్నై: లోదుస్తుల్లో దాచుకుని అక్రమంగా తరలించటానికి ప్రయత్నించిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.5 లక్షల అమెరికా డాలర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులో మంగళవారం చోటు చేసుకుంది.
చెన్నై నుంచి వేకువజామున 3.30 గంటల సమయానికి కొలంబో వెళ్లే శ్రీలంక ఎయిర్‌లైన్స్ విమానం బయలుదేరటానికి సిద్ధంగా ఉంది. ఆ విమాన ప్రయాణీకుల లగేజీని అధికారులు తనిఖీలు చేయడం ప్రారంభించారు.

ఆ సమయంలో చెన్నైకి చెందిన షంషుద్ధీన్ (32) టూరిస్ట్ వీసా మీద శ్రీలంకకు వెళ్లడానికి వచ్చాడు. అతడి కదలికలపై అనుమానం రావడంతో అధికారులు షంషుద్దీన్ లగేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. అయినా అనుమానం నివృత్తి కాని అధికారులు షంషుద్ధీన్ ను గదిలోకి తీసుకుని వెళ్లి తనిఖీలు చేశారు.
ఆ తనిఖీల్లో అతడి లోదుస్తుల్లో కట్టలు కట్టలుగా ఐదు లక్షల అమెరికా డాలర్లు కనిపించాయి. అది లెక్కచూపని నగదు అని తేలింది. దీంతో అతడి ప్రయాణాన్ని రద్దు చేశారు. నిందితుడు షంషుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications