వీడియో వైరల్: బర్త్‌డే వేడుకను వైరైటీగా కట్ చేసి చిక్కుల్లో పడ్డాడు
లక్నో : సాధారణంగా జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేస్తాం. ఎలా కట్ చేస్తాం.. చాకుతో కట్ చేస్తాం. కానీ ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో మాత్రం ఓ యువకుడు వెరైటీగా బర్త్‌డే కేక్ కట్ చేసి జన్మదినం రోజునే చిక్కులు కొని తెచ్చుకున్నాడు. సరూర్‌పూర్ ఖేడ్కీ గ్రామంలో ఓ యువకుడు తన బర్త్‌డే కేక్‌ను తుపాకీ కాల్చి కట్ చేశాడు. అంతేకాదు అదేదో ఘనకార్యం అన్నట్లు వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.

వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. ఓ 12 మంది ఈ బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. బర్త్‌డే బాయ్ చేతిలో దేశీ తుపాకీ ఉంది. ఆ తుపాకీతోనే కాల్చి కేక్‌ను వెరైటీగా కట్ చేశాడు. ఇదిలా ఉంటే వీడియో పోలీసుల దృష్టికి రావడంతో వారు రంగంలోకి దిగి బర్త్‌డే బాయ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇక వేడుకల్లో పాల్గొన్న ఇతరుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
लाइव बर्थडे।। बागपत में फायरिंग कर काट केक@bptpolice @igrangemeerut @Uppolice pic.twitter.com/j9QGVmXW62
— Shadab Rizvi (@ShadabNBT) July 31, 2019
అసలు తుపాకీ అతనికి ఎక్కడినుంచి వచ్చిందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. వీరిపై పాత కేసులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు. మిగతా వారిని కూడా త్వరలోనే పట్టుకుని చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications