వీడు మనిషి కాదు..మృగం: భార్యపై ప్లాస్టిక్ హ్యాండిల్‌ గ్రిప్‌తో అక్కడ దాడి చేశాడు

అనుమానం పెను భూతంగా మారుతోంది. భర్తపై భార్యకు భార్యపై భర్తకు నమ్మకం లేకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో అగ్నిసాక్షిగా చేసుకున్న పెళ్లి కాస్త పెటాకుల వరకు దారితీస్తోంది. కొన్న సందర్భాల్లో ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు.. లేదా ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. భర్త మరొక మహిళతో అక్రమ సంబంధం నెరుపుతున్నాడనే అనుమానం భార్యకు వచ్చింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. ఇక సహనం కోల్పోయిన భర్త ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై పైశాచికంగా దాడి చేశాడు.

మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రకాష్ భిల్ అలియాస్ రామ అనే వ్యక్తి పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు. అతని భార్యకు అనుమానం రావడంతో వారిద్దరి మధ్య రోజు గొడవ జరిగేది. ఇలా రెండేళ్లు పాటు రోజు గొడవపడేవారు. అయితే ఆ గొడవ హద్దు దాటింది. భర్తకు కోపం రావడంతో అత్యంత పాశవికంగా ఆమెపై దాడి చేశాడు. ముందు ఆమెను చితకబాది ఆ తర్వాత ఆమె గర్భాశయంలోకి ఓ ప్లాస్టిక్ రాడ్‌తో దాడి చేశాడు. అది కాస్త లోపలికి గుచ్చుకుపోయి ఆమె మూత్రాశయాన్ని ధ్వసం చేసింది. అంతేకాదు చిన్న పేగులు కూడా దెబ్బతిన్నాయి. ఇది జరిగి రెండేళ్లు అయ్యింది. అయితే బయటకు చెప్పుకోలేకపోయింది ఆ మహిళ. కాలక్రమంలో నొప్పి ఎక్కువగా ఉండటంతో హాస్పిటల్‌కు చికిత్స కోసం వెళ్లగా అసలు విషయం వెలుగు చూసింది.

Man arrested for inderting a plastic handle grip into wifes private parts

తీవ్రరక్తస్రావంతో ఆమె హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యింది. రెండేళ్లుగా ప్లాస్టిక్ హ్యాండిల్ గ్రిప్ ఆమె ప్రైవేట్ భాగాల్లోనే ఇరుక్కుపోవడంతో విపరీతమైన నొప్పిని ఆమె అనుభవించారని వైద్యులు పేర్కొన్నారు. ఆ ప్లాస్టిక్ హ్యాండిల్‌ను తొలగించేందుకు చాలా క్లిష్టమైన సర్జరీ చేయాల్సి వచ్చిందని వైద్యులు తెలిపారు. సర్జరీకి దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించాల్సి వచ్చిందని చెప్పారు. చాలా సమయం పాటు గర్భాశయంలో ప్లాస్టిక్ హ్యాండిల్ చిక్కుకుపోవడంతో ఇన్‌ఫెక్షన్ ఇతర అవయావాలకు పాకిందని వైద్యులు చెప్పారు. సరైన సమయంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. చికిత్స అనంతరం ఆ వివాహిత నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో ఆమె భర్త రామను పోలీసులు అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+