ఉద్యోగం ఇస్తానని ఆశచూపి ఆరుమాసాల పాటు అత్యాచారం

ఉద్యోగం పేరుతో ఓ యువకుడు ఉజ్బెకిస్తాన్ కు చెందిన ఓ యువతిపై ఆరు మాసాలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు చివరకు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు.

న్యూఢిల్లీ:ఉద్యోగం పేరుతో ఓ యువకుడు ఉజ్బెకిస్తాన్ కు చెందిన ఓ యువతిపై ఆరు మాసాలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు చివరకు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో నిందితుడిని అరెస్టు చేశారు.

ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతానికి చెందిన సోను అలియాస్ సుమిత్ అనే వ్యక్తికి ఫేస్ బుక్ ద్వారా ఉజ్బెకిస్తాన్ యువతి పరిచయమైంది. గుర్గావ్ కు చెందిన ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు.

ఈ ఐటీ కంపెనీలో తాను సీనియర్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తున్నట్టు ఆయన యువతిని పరిచయం చేసుకొన్నాడు. ఓ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలకడంతో ఆమె భారత్ కు వచ్చింది.

man arrested for raping a lady over six monhs in delhi

ఆరు మాసాల క్రితం ఆమె ఢిల్లీకి చేరుకొంది. ఎయిర్ పోర్ట్ లో ఆమెను రిసీవ్ చేసుకొన్నాడు.సెక్యూరిటీ డిపాజిట్ కింద ఆమె నుండి పాస్ పోర్టు , డబ్బు తీసుకొన్నాడు. ఆమెను ఓ ప్రాంతంలో ఉంచాడు.

ఆరు మాసాల పాటు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు.అయితే బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపారు.నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణచేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+