హోటల్లో సెక్స్ రాకెట్ రట్టు, మోడల్‌ను రక్షించారు

Man arrested for running sex racket
అహ్మదాబాద్: గుజరాత్ రాష్ట్రానికి చెందిన పోలీసులు ఓ సెక్స్ రాకెట్ గుట్టును రట్టు చేసి, ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అహ్మదాబాదులోని ఓ హోటల్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న పోలీసులు ఇటీవల రైడ్ చేశారు. ఇందుకు సంబంధించి హోటల్ మేనేజర్ నిజాముద్దీన్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.

మేనేజర్‌గా పని చేస్తున్న నిజాముద్దీన్‌కు ఉమేష్ అనే వ్యక్తి సహకరిస్తున్నాడు. అతను వివిధ నగరాల నుండి యువతులను తీసుకు వచ్చి సెక్స్ రాకెట్ నడుపుతున్నారు. ఈ దాడిలో ముగ్గురు యువతులను వ్యభిచారకూపం నుండి కాపాడినట్లు పోలీసులు తెలిపారు. అందులో ఒకరు స్మాల్ టైమ్ మోడల్ కూడా ఉన్నారని తెలిపారు.

మహిళలపై పెరిగిన నేరాలు

మహారాష్ట్ర రాజధాని ముంబైలో మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత సంవత్సరంతో పోలిస్తే నేరాల సంఖ్య 59 శాతం పెరిగిందని ఓ ఎన్జీవో సంస్థ వెల్లడించింది. కేవలం 8 శాతం నేరాల్లో మాత్రమే శిక్షలు పడ్డాయని ఆ సంస్థ తెలిపింది.

ముంబైలో నివసిస్తున్న వారిలో 32 శాతం మంది నగరంలో రక్షణ లేదని భావిస్తుండగా, 36 శాతం మంది ఒకచోటి నుంచి మరోచోటికి సురక్షితంగా వెళ్ళే పరిస్థితి లేదని అభిప్రాయపడుతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే అత్యాచార కేసులు 47 శాతం, వేధింపు కేసులు 52 శాతం, చైన్ స్నాచింగ్ కేసులు 66 శాతం పెరిగాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+