viral video:వావ్.. కాప్, కత్తితో దాడి చేయబోయిన వ్యక్తిని నిలువరించి.. వైరల్
పోలీసులు.. ఎప్పుడూ టెన్షన్.. వారికి సంబంధించి చెడు అయితే వేగంగా ప్రచారం అవుతుంది. చేసిన మంచి కూడా అదేస్థాయిలో వస్తోంది. కానీ అనుకున్నంత రావడం లేదు. సోషల్ మీడియా పుణ్యాన పోలీసుల ధైర్య సాహసాలు కూడా వెంటనే ప్రపంచానికి తెలుస్తున్నాయి. కేరళలో ఓ కాప్ ప్రదర్శించిన ధైర్య సాహసాలు పలువురి చేత అభినందనలు గురిచేస్తోంది. ఆ వీడియో వైరల్ అవుతుంది.

కత్తి తీసి దాడి..
అళప్పుళ జిల్లా నూరానాద్ పోలీస్ స్టేషన్‌లో అరుణ్ కుమార్ ఎస్సైగా పనిచేస్తున్నారు. తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పారా జంక్షన్ ప్రాంతంలో రోడ్డు పక్కన స్కూటీ పార్క్ చేసిన వ్యక్తి వద్ద తన వాహనం ఆపారు. ఇద్దరి మధ్య వాగ్వివాద జరిగింది.. పోలీసు జీపు మరికాస్త ముందుకు వచ్చి ఆపగా, ఆ స్కూటీ వద్ద ఉన్న వ్యక్తి వేటకత్తి తీసి ఎస్సై అరుణ్ కుమార్ పై దాడికి యత్నించాడు.

కత్తిని పట్టుకున్న ఎస్సై
అవతలి వ్యక్తి ప్రమాదకర రీతిలో కత్తి విసురుతున్నా, ఎస్సై అరుణ్ కుమార్ వెనక్కి తగ్గకుండా అతడిని ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరూ కిందపడిపోయారు. చివరికి ఎస్సై అరుణ్ కుమార్ ఆ వ్యక్తిని నేలకు అదిమిపట్టి కత్తిని లాగేసుకున్నారు. ఇంతలో స్థానికులు వచ్చి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారు. అనంతరం ఆ వ్యక్తిని పోలీసులు తమ వాహనంలో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
బండి తీయమంటేనే
రోడ్డు పక్కన ద్విచక్రవాహనం పార్క్ చేసిన వ్యక్తి ఎస్సైతో వాగ్వాదం జరిపాడు. బండి తీయమని కోరితే కత్తితో దాడికి యత్నించాడు. ఆ ఎస్సై ఏమాత్రం భయపడకుండా ఆ వ్యక్తిని కిందపడేసి కత్తిని స్వాధీనం చేసుకోవడం ఆ వీడియోలో చూడొచ్చు. పోలీసులపై దాడికి దిగిన ఆ వ్యక్తిని సుగతన్ (48)గా గుర్తించారు. నూరానాద్ ప్రాంతానికి చెందినవాడే ఇతను. దాడిలో ఎస్సై అరుణ్ కుమార్ చేతికి గాయమైంది. ఆ గాయానికి ఏడు కుట్లు పడినట్టు పోలీసులు వెల్లడించారు. వీడియోను ఓ వ్యక్తి చిత్రీకరించగా, దాన్ని పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముంది తెగ వైరల్ అవుతుంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications