బాత్ రూమ్ నుంచే కోర్టు లైవ్ విచారణకు హాజరు

కోర్టుల్లో క్రమశిక్షణ, గౌరవాన్ని న్యాయమూర్తులు చాలా సీరియస్‌గా తీసుకుంటారు. అలాంటిది, గుజరాత్ హైకోర్టులో జరిగిన ఓ ఘటన ఇప్పుడు వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి ఏకంగా బాత్‌రూమ్‌లోంచి వర్చువల్ విచారణకు హాజరై, న్యాయమూర్తిని షాక్‌కు గురిచేశాడు.

జూన్ 20న గుజరాత్ హైకోర్టులో జస్టిస్ నిర్జర్ ఎస్. దేశాయ్ ఓ పిటిషన్‌పై వాదనలు వింటున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. తనపై నమోదైన చెక్ బౌన్స్ కేసులో ఎఫ్‌ఐఆర్ రద్దు చేయాలని కోరుతూ కోర్టును ఆశ్రయించిన ఫిర్యాదిదారుడే ఈ విచిత్ర పరిస్థితికి కారణం. వర్చువల్ విచారణ జరుగుతున్నప్పుడు, 'సమద్ బ్యాటరీ' అనే ఐడీతో జూమ్ కాల్‌లో ఉన్న ఓ వ్యక్తి, బ్లూటూత్ హెడ్‌ఫోన్స్ ధరించి టాయిలెట్ సీటుపై కూర్చుని కనిపించాడు.

man Attend a live court hearing from the bathroom

న్యాయమూర్తి వాదనలు వింటుండగా, ఆ వ్యక్తి తన ఫోన్ వీడియో ఆన్‌లోనే ఉంచి బాత్‌రూమ్‌లో తన పని కానిచ్చేశాడు. ఆ తర్వాత ఫోన్‌ను నేలపై ఉంచి శుభ్రం చేసుకుని మరో గదిలోకి వచ్చి విచారణలో కొనసాగాడు. తాను వీడియో మోడ్ ఆఫ్ చేశాడనుకుని చేశాడా, లేక ఉద్దేశపూర్వకంగానే చేశాడా అనేది స్పష్టంగా తెలియకపోయినా, ఈ దృశ్యమంతా లైవ్‌లో స్ట్రీమ్ అయ్యింది.

నిజానికి కోర్టు విచారణ సమయంలో ఇలాంటి అభ్యంతరకర ప్రవర్తనను న్యాయమూర్తులు ఏ మాత్రం ఉపేక్షించరు. గత మార్చిలో ఇలాగే ఓ వ్యక్తి లావెటరీ నుంచి కోర్టు విచారణకు హాజరు కాగా, ఆగ్రహించిన జడ్జి అతనికి రూ. 2 లక్షల జరిమానా విధించడంతో పాటు, కోర్టు ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని శిక్ష విధించారు. గత ఫిబ్రవరిలో బెడ్‌పై పడుకుని విచారణలో పాల్గొన్న వ్యక్తికి రూ.25 వేలు జరిమానా విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+