Ex lover:నగ్న ఫోటోలు, వీడియోల దెబ్బకు రూ. 1. 25 కోట్లు స్వాహా, మాజీ ప్రియుడి ఎఫెక్ట్, సోషల్ మీడియాలో
బెంగళూరు/ వైట్ ఫీల్డ్: శ్రీమంతుల కుటుంబానికి చెందిన యువతి, మరో యువకుడు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించిన ప్రేమికులు సినిమాలు, షికార్లు, విహారయాత్రలకు వెళ్లి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు. ప్రేమికుల పెళ్లికి అమ్మాయి కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. 10 సంవత్సరాల క్రితం వేరే యువకుడిని పెళ్లి చేసుకున్న యువతి అతనితో కాపురం చెయ్యడంతో ఓ కుమారుడు పుట్టాడు. ఇన్ని సంవత్సరాల తరువాత నీ నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని మాజీ ప్రియుడు బ్లాక్ మెయిల్ చెయ్యడంతో మాజీ ప్రియురాలు అక్షరాల రూ. 1. 25 కోట్లు సమర్పించుకుంది. అయితే ఇంకా డబ్బులు కావాలని మాజీ ప్రియుడు టార్చర్ పెట్టడంతో థ్రిల్లర్ సినిమా స్టోరీ మొదలైయ్యింది.

ఐటీ సిటీలో లవర్స్
బెంగళూరులో నివాసం ఉంటున్న మహేష్ అనే యువకుడు, బెంగళూరు సిటీలోని వైట్ ఫీల్డ్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రష్మి (పేరు మార్చడం జరిగింది) 12 సంవత్సరాల క్రితం ప్రేమించుకున్నారు. మహేష్, రష్మి పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. రెండు సంవత్సరాల పాటు ప్రేమికులు మహేష్, రష్మి సినిమాలు, షికార్లు, విహారయాత్రలకు వెళ్లి పిచ్చపాటిగా ఎంజాయ్ చేశారు.

కోటీశ్వరుడి కూతరు.....పాత సినిమా స్టోరీ
మహేష్ ను పెళ్లి చేసుకుంటానని రష్మి ఆమె కుటుంబ సభ్యులకు చెప్పింది. కోటీశ్వరురాలైన రష్మి మహేష్ ను పెళ్లి చేసుకోవడానికి ఆమె కుటుంబ సభ్యులు వ్యతిరేకించారు. పెద్దలను ఎదిరించి మహేష్ ను పెళ్లి చేసుకుంటే లేనిపోని కష్టాలు ఎదురౌతాయని, నువ్వు సుఖంగా సంసారం చెయ్యలేవని ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు రష్మికి బ్రైన్ వాష్ చేశారు.

10 ఏళ్ల క్రితం పెళ్లి
మహేష్ ను పెళ్లి చేసుకుని కష్టాలు పడటంకంటే పెద్దులు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని రష్మి డిసైడ్ అయ్యింది. 10 సంవత్సరాల క్రితం కోటీశ్వరుడైన రాకేష్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తితో రష్మి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. రష్మి పెళ్లి సమయంలో ఆమె ప్రియుడు మహేష్ కూడా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. రాకేష్, రష్మిల దంపతులకు 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు.

హలో బాగున్నావా ? ఎలా ఉన్నారు
కొన్ని నెలల క్రితం రష్మికి ఆమె ప్రియుడు మహేష్ ఫోన్ చేశాడు. నువ్వు ఎలా ఉన్నావ్ ? నీ కాపురం ఎలా ఉంది ? నీ భర్త, కొడుకు బాగున్నారా ? అంటూ ఆమెను మంచితనంతో మాట్లాడుతూ వచ్చాడు. తమ మాజీ ప్రియుడు మహేష్ మనసులో ఏమీ పెట్టుకోకుండా తనతో మంచిగా మాట్లాడుతున్నాడని రష్మి గుడ్డిగా నమ్మి నాలుగు నెలల పాటు అతనితో ఫోన్ లో మాట్లాడుతూ అప్పుడప్పుడు కలుస్తూ వచ్చింది.

నగ్న వీడియోల దెబ్బకు రూ. 1. 25 కోట్లు స్వాహా
అంతే నెల రోజుల క్రితం మహేష్ బాంబు పేల్చాడు. నీ నగ్న ఫోటోలు, వీడియోలు నా దగ్గర ఉన్నాయి. తనకు రూ. 1. 20 కోట్లు డబ్బులు ఇవ్వకపోతే ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని, తరువాత నీ జీవితం నాశనం అయిపోతుందని మహేష్ మాజీ ప్రియురాలు రష్మిని బ్లాక్ మెయిల్ చేశాడు. మాజీ ప్రియుడు 10 ఏళ్ల తరువాత ఇలా బ్లాక్ మెయిల్ చెయ్యడంతో రష్మి హడలిపోయింది. అంతే పుట్టింటి నుంచి, బంధువులు, స్నేహితుల నుంచి రూ. 1. 25 కోట్లు తీసుకున్న రష్మి మాజీ ప్రియుడు మహేష్ చెప్పిన అపర్ణ అనే మహిళ బ్యాంకు అకౌంట్ లో రూ. 1. 25 కోట్లు డబ్బు డిపాజిట్ చేసింది.

భర్తకు ప్రేమకథ చెప్పిన భార్య
రూ. 1. 20 కోట్లు డబ్బులు ఇచ్చినా మహేష్ మళ్లీ తనకు రూ. 1 కోటి ఇవ్వాలని ప్రియురాలు రష్మిని వేధింపులకు గురిచేశాడు. అయితే అంత డబ్బులు ఇవ్వలేక, మాజీ ప్రియుడు మహేష్ టార్చర్ తట్టుకోలేని నెల రోజుల పాటు రష్మి నరకం అనుభవించింది. ఇక లాభం లేదని తెలుసుకున్న రష్మి జరిగిన విషయం మొత్తం భర్త రాకేష్ కు చెప్పింది.

మొగుడి ఎంట్రీతో మాజీ ప్రియుడు ఫినిష్
తన భార్య రష్మి బాధచూసి తట్టుకోలేక ఆమె భర్త రాకేష్ నేరుగా వైట్ ఫీల్డ్ పోలీస్ స్టేషన్ చేరుకుని తన భార్యను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అతనే కేసు పెట్టాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేసి మహేష్, అతనికి సహకరించిన రష్మి నుంచి తన బ్యాంకు అకౌంట్ కు డబ్బులు డిపాజిట్ చేయించుకున్న అపర్ణను పోలీసులు అరెస్టు చేశారు. మహేష్, అపర్ణ ఇంకా ఎంతమందిని ఇలా బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు లాక్కొన్నారు ? అని ఆరా తీస్తున్నామని బెంగళూరులోని వైట్ ఫీల్డ్ పోలీసులు తెలిపారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications