అమ్మాయి రెచ్చగొట్టిందని నగ్న వీడియోలు పంపిస్తే!: దిమ్మ తిరిగే షాక్..

యువతి పేరుతో ఖాతా తెరిచి పలువురు యువకులకు గాలం వేశాడు.

పుణే: ఫేస్‌బుక్ మోసాల జాబితాలో మరో ఘరానా మోసం వెలుగుచూసింది. అమ్మాయి పేరిట ఖాతా తెరిచిన ఓ యువకుడు కొంతమంది యువకులను ముగ్గులోకి లాగి.. డబ్బుల కోసం వారిని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. పూణే సైబర్ సెల్ పోలీసు విభాగానికి వచ్చిన ఫిర్యాదుతో అతగాడి మోసాల లీలలు బయటపడ్డాయి.

వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని నాందేడ్ కు చెందిన సుహీత్ యశ్వంత్ జాదవ్ (25) దూర విద్య ద్వారా న్యాయశాస్త్రం చదువుతున్నాడు. అమ్మాయి పేరుతో ఫేస్‌బుక్ లో ఖాతా తెరచిన యువకుడు.. పలువురు యువకులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ లు, మెసేజ్ లు పంపించాడు. మెల్లి మెల్లిగా చాటింగ్ ల ద్వారా వారిని ముగ్గులోకి దింపాడు.

man blackmails youth with nude videos in pune

శృంగారపరమైన మాటలతో రెచ్చగొట్టి వారి నగ్న వీడియోలు సంపాదించాడు. ఆపై డబ్బులివ్వకపోతే వాటిని బయటపెడుతానంటూ బ్లాక్ మెయిల్ చేస్తూ వచ్చాడు. కొంతమంది యువకులు డబ్బులు సమర్పించుకోగా.. మరికొంతమంది దీనిపై పుణే సైబర్ సెల్ పోలీసు విభాగానికి ఫిర్యాదు చేశారు. అమ్మాయి అనుకుని తాము చాట్ చేశామని, ఇలా జరుగుతుందని ఊహించలేదని వారు పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఐపీ అడ్రెస్ సహాయంతో అతని ఆచూకీ గుర్తించారు.నాందేడ్ లోని సారంగ్ సొసైటీలో అతన్ని అదుపులోకి తీసుకుని ఐపీసీ 201, 420, 484,485 సెక్షన్లు, ఐటీ యాక్టు 66 (సి), 66 (డి), 67ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+