ఇంటికొచ్చిన అమ్మాయికి మత్తుమందిచ్చి నగ్న వీడియోలు తీశాడు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ప్రాంతంలో యువతులు, మహిళలపై ఆకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన మరో ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పొరుగింటికి వచ్చిన అమ్మాయికి మత్తు మందు కలిపిన జ్యూస్ ఇచ్చి.. ఆమె మత్తులోకి జారుకున్నాక అభ్యంతరకరమైన చిత్రాలు, వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు ఓ ప్రబుద్ధుడు.
ఢిల్లీ సమీపంలోని ఫరీదాబాద్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ఫరీదాబాద్ కు చెందిన 19 ఏళ్ల అమ్మాయి తన పొరుగున ఉన్న గితూ ఇంటికి వెళ్లింది. ఆమె ఒక్కతే ఇంట్లో ఉండటంతో రాత్రంతా అక్కడే ఉండిపోయింది ఆ అమ్మాయి.

ఇంటికి వచ్చిన పొరుగింటి అమ్మాయికి మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చింది గీతూ. అంతే ఆ జ్యూస్ తాగిన అమ్మాయి నిద్రలోకి జారుకుంది. దీంతో గితూకు బావ వరుస అయ్యే ప్రవేష్ అనే వ్యక్తి.. ఈ అమ్మాయి నగ్నచిత్రాలు, వీడియోలు తీశాడు.
మరుసటి ఉదయం ఆ అమ్మాయికి మెలకువ రాగానే ఇంటి నుంచి నగలు, డబ్బు తీసుకొని వచ్చి తనను పెళ్లి చేసుకోవాలని లేకుంటే నగ్న చిత్రాలు, వీడియోలను ఇంటర్నెట్‌లో అప్ లోడ్ చేస్తానని ప్రవేష్ బ్లాక్ మెయిలింగ్ చేశాడు. దీంతో భయపడిన అమ్మాయి ప్రవేష్‌కు కొంత డబ్బు ఇచ్చింది.
అయినా ప్రవేష్ బ్లాక్ మెయిలింగ్ కొనసాగిస్తుండటంతో విసిగిపోయిన అమ్మాయి చివరకు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడు ప్రవేష్‌ను మంగళవారం అరెస్ట్ చేశారు. అతని వద్ద ఉన్న ఆమె అశ్లీల చిత్రాలు, వీడియోలను స్వాధీనం చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు! -
మిథున రాశి 2026 2027 జాతకం.. ఈ ఏడాది వీరి మాటే శాసనం! -
టీమిండియాపై విధ్వంసకర సెంచరీ: కెప్టెన్‌గా ప్రమోషన్ -
వరల్డ్ కప్ గెలిచినా తప్పని చిక్కులు! ఆ ఆటగాడిపై ఐసీసీ వేటు?












Click it and Unblock the Notifications