వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూట్యూబ్‌లో యువతి వీడియోలు అప్‌లోడ్, డ్యాన్సర్‌పై కేసు

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఫరీదాబాద్: ఓ యువతి ఫోటోగ్రాఫ్‌లు కలిగి ఉన్న వీడియోను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేస్తున్న ఓ వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఫరీదాబాద్ పోలీసులు గురువారం నాడు చెప్పారు. సదరు నిందితుడి పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

సదరు వ్యక్తి ఆమెకు సంబంధించిన ఫోటోలు ఉన్న వీడియోలను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేస్తూ వేధిస్తున్నాడు. ఆమెను అడగకుండానే అతను అలా చేస్తున్నాడు. అంతేకాకుండా, తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. దీంతో, అతని వేధింపులు తట్టుకోలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Man booked for harassing a woman

పోలీసులకు ఆ 22 ఏళ్ల యువతి చేసిన ఫిర్యాదు మేరకు... మనీష్ అనే వ్యక్తి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మనీష్ డ్యాన్సర్. అతను ఓ వీడియో పాటను యూట్యూబ్‌లో అప్ లోడ్ చేశాడు. అందులో బాధిత యువతి కూడా ఉంది. ఆమె అనుమతి లేకుండానే అతను అలా చేశాడు.

అంతేకాదు, చాలా రోజులుగా తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మనీష్, బాధిత యువతి సూరజ్ కుండ్ ప్రాంతంలో పక్కపక్కనే ఉంటారు. ఆమెను ఫోన్లో కూడా వేధిస్తుంటాడు. బుధవారం సాయంత్రం కేసు నమోదు చేసుకొని, విచారిస్తున్నారు.

English summary
A man has been booked for allegedly uploading a video on Youtube containing a woman's photograph, used without her permission, and pressurising her to marry him, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X