అంబులెన్స్ ఇవ్వని అధికారులు : భార్య శవాన్ని మోసుకెళ్ళిన భర్త
లక్నో: అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ వివాహిత మృతి చెందింది. అయితే ఆమె మృతదేహన్ని తరలించేందుకు అవసరమైన అంబులెన్స్‌ను ఇచ్చేందుకు ఆసుపత్రి సిబ్బంది నిరాకరించడంతో భార్య మృతదేహన్ని భుజంపైనే మోసుకొంటూ తీసుకెళ్ళాడో ఓ వ్యక్తి. ఈ ఘటన మీడియాలో ప్రసారమైంది. దీనిపై విచారణకు ఆదేశించారు. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్‌లో ఈ ఘటన చోటు చేసుకొంది.
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బదౌన్‌కు చెందిన ఓ వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్న భార్యను బదౌన్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అనారోగ్యంతో ఆమె మృతి చెందింది. భార్య మృతదేహన్ని ఇంటికి తీసుకెళ్ళేందుకు ఆసుపత్రి సిబ్బందిని అంబులెన్స్ అడిగాడు.
కానీ, ఆసుపత్రి సిబ్బంది అంబులెన్స్ ఇవ్వలేదు. ఆటో కూడ రాకపోవడంతో భార్య మృతదేహన్నిఆ వ్యక్తి తన భుజాలపై మోసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. ఈ ఘటనను మీడియా పెద్ద ఎత్తున ప్రసారం చేసింది.

ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్టుగా బదౌన్ ఆసుపత్రి చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రకటించారు. అంబులెన్స్ అడిగిన కొద్ది సేపటికే మృతదేహం ఆ వ్యక్తి ఆసుపత్రి ఆవరణ నుండి వెళ్ళిపోయాడని ఆసుపత్రివర్గాలు చెబుతున్నాయి. అంబులెన్స్ ఇచ్చేందుకు తాము నిరాకరించలేదని ఆసుపత్రివర్గాలు ప్రకటిస్తున్నాయి.
అయితే ఆసుపత్రిలో తాను ఈ విషయమై అంబులెన్స్ అడిగినా సిబ్బంది నుండి సరైన సమాధానం లేదన్నారు.ఈ కారణంగానే తన భార్య మృతదేహన్ని భుజాలపై మోసుకొచ్చినట్టు చెప్పారు.
-
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
రేవంత్ గుడ్ న్యూస్: 'కల్యాణ లక్ష్మి' సాయం పెంపు, రూ.2,016 పెన్షన్ ఇక నుంచి..!! -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం.. ఉగాది తర్వాత -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
Red Alert : భారీ ఈదురు గాలులు, పిడుగులు పడే ఛాన్స్!












Click it and Unblock the Notifications