పబ్‌లో యువతి పట్ల అసభ్య ప్రవర్తన, కాల్పులు: అరెస్ట్

 Man caught on camera opening fire at a pub manager
ముంబై: ముంబైలో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా... ప్రశ్నించిన ఓ పబ్ మేనేజర్‌పై కాల్పులు జరిపిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన మే 30వ తారీఖున జరిగింది. ఘటనకు కారణమైన విక్రమ్ కుమార్‌ను అంబోలీ పోలీసులు అరెస్టు చేశారు.

నిందితుడు ఓ పబ్బులో యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లుగా ఉన్న వీడియోను పోలీసులు గుర్తించారు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన యువతి అతని పైన పబ్ మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది.

నిందితుడి వద్దకు వెళ్లిన మేనేజర్ యువతికి క్షమాపణలు చెప్పాలని కోరారు. దీంతో అతను నిందితుడు తన లైసెన్స్డ్ రివాల్వర్ తీసి మేనేజర్ పైన కాల్పులు జరిపాడు. ఇది కూడా కెమెరాకు చిక్కింది. ఈ ఘటనలో మేనేజర్ జితెందర్ కుమార్ ఝాకు గాయాలయ్యాయి. దీనిపై జితెందర్ కుమార్ ఝా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. బంగారు ఆభరణాల వర్తకుడు విక్రమ్ కల్లోడి పబ్‌లో ఓ యువతి దగ్గర ఫోన్‌ను గుంజుకోవడానికి ప్రయత్నించాడు. దాన్ని ఆమె అడ్డుకోవడానికి ప్రయత్నించగా, అతడు ఆమె చేతులు పట్టుకోవడానికి ప్రయత్నించాడు.

మేనేజర్ జోక్యం చేసుకుని ఆమెకు క్షమాపణలు చెప్పాలని విక్రమ్‌ను కోరాడు. అందుకు అతడు నిరాకరించడమే కాకుండా తుపాకీ తీసి మేనేజర్ కాలుపై కాల్చాడు. సరిగ్గా తనిఖీలు చేయకపోవడం వల్లే అతడు తుపాకీని లోపలికి తీసుకెళ్లగలిగాడని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిపై లైంగిక వేధింపుల కేసుతో పాటు, హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+