భార్యను ముక్కలు ముక్కలుగా నరికి నదిలో..

 Man chops wife into pieces, disposes of body in Wainganga
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని మానెవాడలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అతికిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పారేశాడు కసాయి భర్త. హడ్కేశ్వర్ పోలీసులు నిందితున్ని బుధవారం అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. నిందితుడు సుధీర్, దీప్తిలకు 2003లో వివాహం జరిగింది. వారు మానెవాడలోని లక్ష్మీనగర్‌లో నివాసముంటున్నారు. సుధీర్ డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

కాగా గత కొంత కాలంగా వారిద్దరి మధ్య ఆస్తికి సంబంధించిన వివాదం జరుగుతున్నట్లు తెలిసింది. థర్మకోల్ వ్యాపారంలో వచ్చిన 60వేల రూపాయలను తనకివ్వాలని, మామ పేరున ఉన్న థర్మాకోల్ దుకాణాన్ని తన పేరు మీద రాయాలని దీప్తి భర్త సుధీర్‌పై ఒత్తిడి చేసింది. ఇందుకు సుధీర్ నిరాకరించడం వల్ల తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.

సెప్టెంబర్ 11న తమ కుమారుడు ఆయూష్ పాఠశాలకు వెళ్లిన సమయంలో దంపతులిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహానికి గురైన సుధీర్ భార్య దీప్తి గొంతు నులిమి, తలను గోడకు బాదడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భార్య మృతదేహాన్ని వంట గదిలో ఉంచిన సుధీర్, పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన కొడుకు ఆయూష్‌కి తన తల్లి పని మీద బయటికి వెళ్లిందని చెప్పాడు.

తన కొడుకు నిద్రలోకి జారుకున్న తర్వాత అర్ధరాత్రి లేచిన సుధీర్ థర్మకోల్ కట్ చేసే కత్తులతో దీప్తి మృతదేహాన్ని ఏడు ముక్కలుగా నరికేశాడు. తర్వాత శరీర భాగాలను మూడు పాలీథిన్ కవర్లలో థర్మకోల్ సీట్లతో బంధించి మళ్లీ వంట గదిలోనే ఉంచాడు. సెప్టెంబర్ 12న గోండియా పరిసర ప్రాంతంలో చెట్లు నాటించాలని చెప్పి కొందరు కూలీలతో గోతులను తవ్వించాడు. తన తండ్రి కారులో పాలీథిన్ కవర్లలో బంధించిన దీప్తి మృతదేహాన్ని తీసుకెళ్లి ఆ గోతిలో పాతిపెట్టాడు.

ఆ తర్వాత తన స్వస్థలం ముర్ధర చేరుకున్నాడు. సెప్టెంబర్ 14న తన భార్య కనిపించడం లేదని హడ్కేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లో చిన్న గొడవ కారణంగా తనను విడిచి వెళ్లిందని కుటుంబ సభ్యులను, స్నేహితులను నమ్మించాడు. అయితే కొన్ని జంతువులు తవ్వడంతో దీప్తి మృతదేహం బయటికి రావడంతో తిరిగి మృతదేహాన్ని కారులో తీసుకుని వైన్‌గంగా నదివైపు బయల్దేరాడు.

మార్గ మధ్యంలో కారు నిలిచిపోవడంతో దగ్గరలోని పలువురు గ్రామస్తులను సహాయం కోసం పిలిచాడు. వారి సహాయంతోనే దీప్తి మృతదేహాన్ని వైన్‌గంగా నదిలో విడిచిపెట్టాడు. కాగా కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సుధీర్‌ను తమదైన శైలిలో విచారించగా నిజం బయటపడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+