మృగరాజుతో చెలగాటం.. సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లి, రెచ్చగొట్టిన యువకుడు...(వీడియో)
Recommended Video
పులి నొట్లో తలపెట్టే సాహసం ఎవరైనా చేస్తారా ? సింహం ఎన్‌క్లోజర్‌లో దూకే ధైర్యం ఉందా ? ఖచ్చితంగా లేదు. పులి, సింహాలను ఎన్‌క్లోజర్ నుంచి చూడాలంటేనే గజ్జుమంటారు. అదీ దాని వద్దకెళ్లడం అంటే మాములు విషయం కాదు. బీహార్‌కు చెందిన రెహన్ ఖాన్ మాత్రం సింహం ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లాడు. అంతేకాదు సింహన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఎన్‌క్లోజర్‌లో అతని సాహసాన్ని బయట నుంచి చూస్తోన్న జనం గజగజ వణికిపోయారు.

జూ లో హల్‌చల్
ఢిల్లీలోని జూ లో జంతువులను చూసేందుకు గురువారం సందర్శకులు వచ్చారు. వారిలో బీహార్‌కు చెందిన రెహన్ ఖాన్ ఒక్కరు. అందరూ జంతువులను చూస్తుండగా రెహన్ ఖాన్ మాత్రం సింహంతో ఆటాడే సాహసం చేశాడు. అయితే రెహన్ ఖాన్ మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు భావిస్తున్నారు. అతను మద్యం కూడా సేవించాడని ప్రాథమికంగా తెలిసింది.

ఒక్కసారిగా వచ్చి
జూ లో సందర్శకులు పులులు, సింహాలను చూస్తున్నారు. ఇంతలో రెహన్ ఖాన్ అక్కడికి వచ్చి సింహం ఎన్‌క్లోజర్‌లోకి దూకేందుకు ప్రయత్నించారు. అక్కడున్న వారు అతనిని వద్దని వారించినా ఫలితం లేకపోయింది. అందులో దూకేశాడు. అక్కడే ఉన్న సింహం కూడా రెహన్ ఖాన్ వద్దకు వచ్చింది. దానిని చూసిన ఖాన్ అదర లేదు, బెదరలేదు. దాని ముందే కుప్పి గంతలు చేశాడు. ముందు కూర్చొని సింహనికే సవాల్ విసిరాడు. ఇదంతా చూస్తున్న జనం గగ్గొలు పెట్టారు. అయినా వినకుండా దానిముందే పడుకున్నాడు. లేచాడు, సింహాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇదంతా చూస్తున్న సందర్శకుల గుండె ఆగినంత పనైపోయింది.
అడుగు దూరంలో
సింహానికి కేవలం అడుగుదూరంలోనే రెహన్ ఖాన్ ఉండిపోయాడు. సింహాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో.. అప్పటికే అక్కడికి వచ్చిన జూ సిబ్బంది సింహాన్ని కూల్ చేశారు. సింహాం రెచ్చిపోకుండా చేసి.. శాంతపరిచారు. ఈ లోపు మెరికల్లాంటి సిబ్బంది కొందరు వచ్చి ఎన్‌క్లోజర్ నుంచి రెహన్‌ఖాన్‌ను బయటకు తీశారు. సింహం ముందు కుప్పిగంతలు వేసినా.. ఏమీ కాకుండా బయటకు తీశామని జూ అధికారులు పేర్కొన్నారు. రెహన్ ఖాన్‌కు గాయాలేమీ కాలేదని తెలిపారు.

మానసిక పరిస్థితి బాలేదు
రెహన్ ఖాన్‌ది బీహార్ అని డీఎస్పీ తెలిపారు. అతనికి మతిస్థిమితం సరిగా లేదని భావిస్తున్నామని పేర్కొన్నారు. దీంతోపాటు అతను మద్యం సేవించాడని భావిస్తున్నారు. అతనికి వైద్య పరీక్షలు చేయిస్తామని.. దీంతో ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత వస్తుందని తెలిపారు. సరిగ్గా మధ్యాహ్నం 12.30 గంటలకు జూలో ఘటన జరిగిందని ఆయన మీడియాకు వివరించారు.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications