నశించిన మానవత్వం: కారు బోనెట్ పై ఈ వ్యక్తిని డ్రైవర్ ఎంత దూరం తీసుకెళ్లాడో తెలుసా..?

ఢిల్లీ: ఢిల్లీ దగ్గరలోని ఘజియాబాదులో దారుణం చోటుచేసుకుంది. కారు బోనెట్‌పై ఉన్న వ్యక్తిని అలాగే రెండు కిలోమీటర్లు వరకు తీసుకెళ్లాడు ఓ దుర్మార్గపు డ్రైవరు. అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి ఏమీ కాలేదు. కారును వేగంగా నడిపాడు. కారుపై అలా వేగంగా నడుపుకుంటూ వెళుతుండగా రోడ్డుపై వెళుతున్న మరో వ్యక్తి ఆ దృశ్యాన్ని తన ఫోను కెమెరాలో బంధించాడు. అనంతరం సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వీడియో వైరల్ అయ్యింది.

Man clings to car’s bonnet for nearly 2 km in road rage case near Delhi

ముందుగా ఎక్కడో రోడ్డు ప్రమాదం జరిగినట్లు ఉంది. డ్రైవరును కారులోనుంచి దిగమనేందుకు వెళ్లిన వ్యక్తిపై నుంచి కారును డ్రైవర్ పోనివ్వడంతో కారు బోనెట్‌ను పట్టుకున్నాడు వ్యక్తి. అయితే ఆ వ్యక్తిని కిందకు పడేసేందుకు కారును ఇటూ అటూ డ్రైవర్ తిప్పాడు. అయినప్పటికీ బోనెట్‌ను గట్టిగా పట్టుకున్నాడు వ్యక్తి. అలా దాదాపు రెండు కిలోమీటర్లు వరకు కారు వెళ్లాక డ్రైవర్ చివరిగా కారు ఆపాడు. వెంటనే ఆ వ్యక్తి బోనెట్‌ను వదిలి కారు డ్రైవర్‌ను ముందుగా బయటకు దిగాల్సిందిగా కేకలు వేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.

బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవడంతో రంగంలోకి దిగిన పోలీసులు కారు డ్రైవరును అరెస్టు చేశారు. అంతేకాదు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియోను చూస్తే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఏ చిన్న తప్పిదం జరిగినా ప్రాణాలకే ప్రమాదం. మరి బోనెట్ పై ఉన్న ఆ వ్యక్తి కారును ఆపాల్సిందిగా ఎంత ప్రాథేయపడినప్పటికీ కారు డ్రైవర్ మాత్రం చలించలేదు. అలానే ముందుకు దూసుకెళ్లాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+