భార్యతో డ్యాన్స్ చేస్తూనే మృత్యువు ఒడిలోకి: రాజస్తాన్‌లో విషాదం..
జైపూర్: మొన్నామధ్య పెళ్లి వేడుకలో హుషారుగా బరాత్ చేస్తున్న ఓ వరుడు హఠాత్తుగా కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఓ వ్యక్తి డ్యాన్స్ చేస్తూ స్టేజీ మీదే కుప్పకూలిపోయాడు.
రాజస్తాన్‌లోని బార్మర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. బార్మర్ లో ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కు హాజరైన జంట.. స్టేజీపై 'తుజే దేకా తో హే జానా సనం' పాటకు డ్యాన్స్ చేశారు.

ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్న సందర్భంలో ఆమె భర్త ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అతనేదో సరదాకి ఆటపట్టిస్తున్నాడనుకున్న భార్య.. అలాగే డ్యాన్స్ చేస్తూ అతన్ని లేపడానికి ప్రయత్నించింది.
కానీ అప్పటికే అతను ప్రాణాలు కోల్పోయినట్టు తెలియగానే ఒక్కసారిగా అక్కడున్నవారంతా షాక్ తిన్నారు. హఠాత్తుగా గుండెపోటు రావడం వల్లే అతను చనిపోయాడని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications