భార్యను హత్య చేసి గ్యాంగ్‌రేప్ కథ అల్లిన ఘరానా భర్త

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 27 ఏళ్ల తన భార్యను దోక్రాత్ ఆదివారం రాత్రి హత్య చేశాడు. భార్యను చంపిన అతను ఓ పేక్ స్టోరీ అల్లాడు.
తాము తమ మోటారు సైకిల్ పైన ఆదివారం రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఇంటికి వస్తుండగా నలుగురు దొంగలు లసల్ గావ్ వద్ద అడ్డుకున్నారని, వారు తనను కట్టేసి కొట్టారని, తన భార్య పైన సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, తన భార్య ఒంటి పైన ఉన్న బంగారాన్ని, తన వద్ద ఉన్న డబ్బును మొత్తాన్ని దోచుకెళ్లారని అతను పోలీసులకు కట్టుకథ చెప్పాడు.
అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేసిన పోలీసులు భర్తనే భార్యను చంపాడని నిర్ధారించుకున్నారు. పోలీసులు అతని నుండి మరింత సమాచారం రాబట్టారు. దీంతో భర్త తన తప్పును అంగీకరించాడు. తన భార్యను చంపేందుకు తన స్నేహితుడి సహాయం తీసుకున్నట్లు చెప్పాడు.












Click it and Unblock the Notifications