అసలు వీడు తండ్రేనా: పాప పుట్టిందని ఇంటిపై నుంచి విసిరేశాడు
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతోంది. దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. కానీ మానవుడు మాత్రం అక్కడే ఉన్నాడు. పాతకాలపు ముఢనమ్మకాల దగ్గరే ఆగిపోయాడు. ఆడపిల్ల పుడితే శాపంగా భావిస్తున్నాడు. ఫలితం చిన్నారి కళ్లు తెరిచి లోకం చూడకముందే ప్రాణాలను చిదిమేస్తున్నాడు. తనకి కూడా జన్మనిచ్చింది ఒక స్త్రీ అని మరిపోతున్నాడు. తన భార్యకు రెండవ కాన్పులో కూడా ఆడపాప పుట్టిందని చిన్నారిని ఇంటిపై నుంచి కిందకు విసిరేశాడు ఓ దౌర్భాగ్యపు తండ్రి. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని బరేలీలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే... అరవింద్ గంగ్వార్ అనే వ్యక్తి పర్దౌలీ గ్రామంలో నివాసముంటున్నాడు. అతనికి ఒక కూతురు. భార్య రెండో కాన్పులో కూడా ఆడపాప జన్మించడంతో అసహనానికి గురయ్యాడు. ప్రతిరోజు ఇంటికి తాగొచ్చి భార్యతో గొడవకు దిగేవాడు. ఇలా ఏడాది గడిచిపోయింది. గురువారం ఫూట్‌గా మద్యం సేవించి ఇంటికి వచ్చిన అరవింద్.. పాపను ఇంటిపైకి తీసుకెళ్లి కిందకు విసిరేశాడు. ఏపాపం తెలియని చిన్నారిని చంపే ప్రయత్నం చేశాడు.ఆ బిడ్డకు ఇంకా భూమిపై నూకలు మిగిలే ఉన్నాయి. భగవంతుడు ఆ బిడ్డను కాపాడాడు. ఇంటి పైనుంచి విసిరేయడంతో పాపకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కు తరలించింది తల్లి. ప్రస్తుతం చిన్నారి ప్రాణాల కోసం పోరాడుతోంది.

అరవింద్ భార్య రెండవ బిడ్డకు జన్మనిచ్చినప్పటి నుంచి ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని రోజు అరవింద్ మద్యం సేవించి గొడవ చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. మద్యం మత్తులో ఉన్న అరవింద్ గురువారం తన కూతురును ఇంటిపైకి తీసుకెళ్లి కిందకు విసిరేశాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు. అరవింద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
-
Amaravati: అమరావతి పేరు మార్పు..! సర్కార్ ఉత్తర్వులు జారీ..! -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
ప్రధాని మోదీకి అనూహ్య మద్దతు- లిఖితపూర్వకం -
బిగ్ షాక్: దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సాయంత్రం 2 గంటలు కరెంట్ కట్..! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
H-1B Visa జారీ ఇకపై మరింత.. !! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
స్టాలిన్ చేతికి ఇంటెలిజెన్స్ సర్వే..! షాకింగ్ అంశాలు-ఎక్స్ ఫ్యాక్టర్ గా విజయ్ ? -
today rashiphalalu: ఆర్థికంగా లాభాలున్నాయి, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి












Click it and Unblock the Notifications