మాట్లాడుతుండగానే ఆగిన గుండె.. నిలువునా కుప్పకూలిపోయాడు(వీడియో)

అహ్మదాబాద్ : బ్రతుకో క్షణభంగురం అని వూరికే అనలేదేమో!.. అప్పటిదాకా కళ్లెదుటే ఉన్న వ్యక్తి నిలువునా కుప్పకూలిపోతే..! నిజంగా పుట్టుక-చావు నడుమ బ్రతుకనేది ఓ బుద్బుదప్రాయం మాత్రమే అనిపించకమానదు. ఇదే తరహాలో గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది.

ఇంటి ఎదురుగా నిలబడి భార్యతో ఏదో మాట్లాడుతున్న వ్యక్తి.. ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పటిదాకా తనతో అంత బాగా మాట్లాడిన భర్త.. ఒక్కసారిగా కుప్పకూలడంతో.. ఆ భార్యకు కాళ్లు చేతులాడలేదు. వెంటనే ఇరుగుపొరుగును పిలవడంతో.. చాలామంది అక్కడికి చేరుకుని కిందపడి ఉన్న ఆ వ్యక్తిని పరిశీలించే ప్రయత్నం చేశారు.

అయితే అప్పటికే అతను తన ప్రాణాలు కోల్పోయాడు. హార్ట్ ఎటాక్ కారణంగా అతనలా నిలువునా కుప్పకూలి చనిపోయాడని ఆ తర్వాత నిర్దారించారు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీ ఫుటేజీలో రికార్డవడంతో.. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+