బెంగళూరు జీటీ వరల్డ్ మాల్ లో లిఫ్ట్ లో చిక్కుకుని ఒకరి దుర్మరణం, ముగ్గురికి !
బెంగళూరు జీటీ వరల్డ్ మాల్ లో చెడిపోయిన లిఫ్ట్లిఫ్ట్ లో చిక్కుకుపోయిన నలుగురు, మరమత్తులు ఆలస్యంగాలిలో కలిసిపోయిన యువకుడి ప్రాణాలు, బిగ్ బజార్ వస్తువులు అన్ లోడ్ చేస్తుంటే !
బెంగళూరు: బెంగళూరు నగరంలో ప్రసిద్ది చెందిన మాల్ లో లిఫ్ట్ లో చిక్కుకున్న వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన కేపీ అగ్రహార పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. శుక్రవారం మాగడి రోడ్డులోని జీటీ వరల్డ్ మాల్ లో లిఫ్ట్ లో చిక్కుకున్న శ్రీనివాసన్ (35) అనే వ్యక్తి మరణించాడు.
శుక్రవారం జీటీ వరల్డ్ మాల్ లోని బిగ్ బజార్ లో మెటీరియల్ అనే లోడ్ చేస్తున్న సమయంలో లిఫ్ట్ మరమత్తులకు గురై ఒక్క సారిగా నిలిచిపోయింది. లిఫ్ట్ లో శ్రీనివాసన్ తో పాటు నలుగురు చిక్కుకున్నారు. వెంటనే లిఫ్ట్ మరమత్తులు చెయ్యకపోవడం, ఆలస్యం కావడంతో అందులో ఉన్న వారు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

విషయం తెలుసుకున్న లిఫ్ట్ మెకానిక్ లు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నలుగురిని రక్షించడానికి ప్రయత్నించారు. లిఫ్ట్ మరమత్తులు చేసే సమయానికి శ్రీనివాసన్ మరణించాడని పోలీసులు అన్నారు. మరో ముగ్గురిని రక్షించి ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు.












Click it and Unblock the Notifications