చేపల వేట: గొంతులో చేప ఇరుక్కొని యువకుడి మృతి
హైదరాబాద్: చేపల వేటకు వెళ్లిన ఒక యువకుడి గొంతులో చేప ఇరుక్కొని మృతి చెందిన ఘటన కేరళలోని పాలక్కడ్‌లో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. త్రిస్సూర్ జిల్లాలోని మలాలో ఒక బేకరీలో పనిచేస్తున్న దినేష్ సెలవుపై పాలక్కడ్ జిల్లాలోని ఆలతూర్‌లోని చిట్టిలంచెర్రీ గ్రామానికి వచ్చాడు.

ఆదివారం తన స్నేహితులతో కలిసి చెట్టిలంచెర్రి గ్రామంలోని నీలిచిర ప్రాంతానికి చేపలవేటకు వెళ్లాడు. అక్కడ ఒక చేప పట్టుకొన్నాడు. ఇంతలో నీటిలో మరో చేప కన్పించడంతో చేతిలోని చేపను నోటితో ఒడిసి పట్టుకుని మరో చేపను పట్టుకునే ప్రయత్నం చేశాడు.
ఈ ప్రయత్నంలో నోట్లో ఉన్న చేప... గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. దీంతో శ్వాస తీసుకోవడంతో దినేశ్ ఇబ్బందిపడటాన్ని గమనించిన స్నేహితులు వైద్యుడి వద్దకు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు.












Click it and Unblock the Notifications