ఫేస్‌బుక్‌లో అందమైన ఫోటో పెట్టి, యువతిలా మాట్లాడి..

బెంగళూరు: ఓ వ్యక్తి ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయి ఫోటో పెట్టి, ఓ యువకుడి నుండి రూ.14 లక్షల మేర కుచ్చుటోపీ పెట్టాడు. మంగుళూరుకు చెందిన 23 ఏళ్ల ఓ వ్యక్తి సులభంగా డబ్బు సంపాదించడానికి ఓ ఎత్తుగడ వేశాడు. ఫేస్‌బుక్‌లో ఓ అందమైన అమ్మాయి ఫొటో పెట్టి ఖాతా తెరిచాడు.

ఓ యువకుడితో దీని ద్వారా పరిచయం పెంచుకున్నాడు. తరచూ ఏదో ఒక కారణం చెబుతూ అతని నుంచి డబ్బులు గుంజేవాడు. ఓసారి పర్సు పోయిందని, మరోసారి ఇంటి స్థలం పరిష్కారం కోసమని.. ఇలా మొత్తం రూ.14 లక్షల వరకూ తీసుకున్నాడు.

man duped through Facebook

అతను ఎప్పుడు ఫోన్ చేసినా ప్రత్యేక యాప్ సాయంతో ఆడగొంతుతో మాట్లాడి అనుమానం రాకుండా మేనేజ్ చేసేవాడు. ఇలా డబ్బులు అడుగుతుండడంతో విసిగిపోయిన బాధితుడు.. అతనికి ఫోన్ చేసి నేరుగా కలవాలన్నాడు. దీంతో, అమ్మాయి ఫోటో పెట్టిన అతను చాటింగ్ ఆపేశాడు.

ఓ రోజు బాధితుడికి చెందిన కంప్యూటర్ విడిభాగాల దుకాణంపై కొందరు వ్యక్తులు దాడి చేసి అక్కడి సామాన్లను ధ్వంసం చేశారు. దీనిపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ దాడి ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన వ్యక్తి పనే అని తేలింది. దీంతో, అతడిని ఫేస్‌బుక్ ఆధారంగానే ట్రాప్ చేసి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కళ్ళుతిరిగే వాస్తవాలు వెల్లడించాడు. అతడి మోసాలకు చాలామంది బలయ్యారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+