కూతురు వయసున్న యువతిని..: రైల్వే స్టేషన్‌లో అందరూ చూస్తుండగానే!
Recommended Video

రైల్వేస్టేషన్‌లో అందరూ చూస్తుండగానే అమ్మాయిని ముద్దు పెట్టాడు!!
ముంబై: రైల్వేస్టేషన్‌లో ట్రైన్ కోసం ఎదురుచూస్తున్న ఓ యువతి పట్ల అసభ్యంగా వ్యవహరించాడో ప్రబుద్దుడు. ముంబై తుర్భే రైల్వేస్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
లోకల్ రైలు కోసం ఫ్లాట్‌ఫాంపై వేచియున్న ఓ 18ఏళ్ల యువతిని వెనుక నుంచి వచ్చి అకస్మాత్తుగా ముద్దు పెట్టుకున్నాడు. ఊహించని ఈ సంఘటనకు యువతి ఉలిక్కిపడింది. ఆమె ప్రతిఘటించడంతో ఆ ప్రబుద్దుడు అక్కడినుంచి పరారయ్యాడు.

యువతిని బలవంతంగా ముద్దుపెట్టుకున్న దృశ్యాలన్ని సీసీటీవిలో రికార్డవడంలో.. సదరు వ్యక్తిని ఎట్టకేలకు పట్టుకోగలిగారు. ప్లాట్‌ఫాం నంబర్ 2, 3 సమీపంలోని సబ్‌వేలో అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడిని నరేష్ జోషి(43)గా గుర్తించారు.
సీసీ కెమెరాలలోని దృశ్యాల ఆధారంగా పోలీసులు నరేష్ జోషి(43)పై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు. న్యాయస్థానం జోషికి 14రోజుల కస్టడీకి ఆదేశించింది












Click it and Unblock the Notifications