అత్యాచారానికి ప్రేరేపణ, సెక్స్ ట్రేడ్: వ్యక్తికి పదేళ్లు జైలు

Man gets 10 yrs jail for abetting rape, running sex trade in Delhi
న్యూఢిల్లీ: వ్యభిచారం నడిపే గృహంలో ఓ మహిళను నిర్బంధించి, అత్యాచారానికి ప్రేరేపించినందుకు ఓ వ్యక్తికి ఢిల్లీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేరాన్ని తీవ్రమైందిగా, భయానకమైందిగా కోర్టు అభిప్రాయపడింది.

సంత్ రామ్ అనే వ్యక్తి మైనర్ బాలిక సాయంతో వ్యభిచారం రాకెట్ నడుపుతున్నాడు. ఓ మహిళను వలలో వేసుకుని తన ఇంటిలో నిర్బంధఇంచాడు. వ్యభిచారం చేయాలని ఆమెపై ఒత్తిడి చేశాడు. ఈ దోషి వైరస్ లాంటివాడని, సమాజానికి కలుషితం చేస్తాడని అదనపు సెషన్స్ న్యాయమూర్తి వీరేందర్ భట్ వ్యాఖ్యానించారు.

దోషికి 54 వేల రూపాయల జరిమానా కూడా విధించారు. సంత్ రామ్, అతని మైనర్ వ్యభిచారంలోకి దిగాలని తనపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలు చెప్పింది. నిస్సహాయురాలైన మహిళ పట్ల అది ఘోరం, బాధాకరమైందని కోర్టు వ్యాఖ్యానించింది. తన తల్లికి చికిత్స చేయించేందుకు డబ్బులు సంపాదించడానికి జార్ఖండ్ నుంచి ఢిల్లీకి ఆమె వచ్చింది.

కొంత కాలం స్వస్థలంలో గడిపి 2012లో ఢిల్లీకి తిరిగి వచ్చిందని, ఆమె ఢిల్లీలో పనిమనిషిగా కుదిరేదని పోలీసులు చెప్పారు. ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న ఫ్రెండ్ ఆమెకు సంత్ రామ్ గురించి చెప్పింది. ఇది వరకే సంత్ రామ్ నడుపుతున్న వ్యభిచార వ్యాపారంలో చేరిన ఆమె ఈ మహిళను కూడా లాగడానికి ప్రయత్నించింది.

అయితే, ఆ మహిళ పారిపోవడానికి ప్రయత్నించింది. అయితే, ఆమెను కొట్టారు. ఆరు నెలల పాటు వ్యభిచారం చేయించారు. 2012 అక్టోబర్ 2వ తేదీన ఆమె తప్పించుకుంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+