కడుపున పుట్టిన బిడ్డపైనే తండ్రి రేప్: యావజ్జీవ శిక్ష..
కడుపున పుట్టిన బిడ్డపైనే అత్యాచారానికి పాల్పడ్డ ఓ తండ్రికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది.
ముంబై: పదేళ్ల వయసున్న సొంత కూతురిపైనే అత్యాచారానికి ఒడిగట్టిన ఓ తండ్రికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు పోస్కో చట్టం కింద 34ఏళ్ల ఆ తండ్రికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.
రెండేళ్ల క్రితం, జూన్15,2014న ఈ అత్యాచార ఘటన చోటు చేసుకుంది. నిందితుడి భార్య తన సోదరుడిని హాస్టల్ లో దిగబెట్టడానికి గుజరాత్ వెళ్లగా.. ఆమె ఇద్దరు కూతుళ్లు, భర్త మాత్రమే ఆరోజు ఇంట్లో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన తండ్రి పదేళ్ల వయసున్న కూతురి మీద అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఆ తర్వాత అగస్టు4,2014న కుమారుడు ఈ విషయాన్ని తల్లికి చెప్పడంతో విషయం వెలుగుచూసింది. విషయం తెలియగానే బంధువులను, సన్నిహితులను ఇంటికి పిలిపించి భర్తకు దేహశుద్ది చేయించింది. దీంతో ఇంటినుంచి పారిపోయిన నిందితుడు రెండురోజుల వరకు ఇంటికి రాలేదు.
భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితున్ని పోలీసులు అరెస్టు చేశారు. కేసు తుది విచారణ సందర్బంగా కోర్టు అతనికి యావజ్జీవ శిక్ష ఖరారు చేసింది. తండ్రిగా బిడ్డకు రక్షణగా ఉండాల్సిందిపోయి.. కన్నబిడ్డపైనే అత్యాచారానికి ఒడిగట్టడం సిగ్గుచేటు అని కోర్టు పేర్కొంది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications