ఫ్లాట్‌లో స్పానిష్ మహిళపై రేప్: వ్యక్తికి జీవిత ఖైదు

మొహమ్మ బాద్షా అన్సారీ అనే వ్యక్తి నిరుడు నవంబర్ 5వ తేదీన కత్తితో బెదిరించి తనపై అత్యాచారం చేశాడని ఆ మహిళ ఆరోపించింది. అన్సారీ తెరిచి ఉంచిన కిటికీ ద్వారా ఒంటరిగా ఉంటున్న స్పానిష్ మహిళ ఫ్లాట్‌లో చొరబడ్డాడని, కత్తితో బెదిరించి ఆమెపై అత్యాచారం చేశాడని ప్రాసిక్యూషన్ వాదించింది.
అన్సారీని పోలీసులు నిరుడు నవంబర్ 6వ తేదీన అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరిలో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు.
అన్సారీ దోపిడీకి పాల్పడ్డాడని, స్పానిష్ సంగీతజ్ఞురాలిపై అత్యాచారానికి ఒడిగట్టాడని పోలీసులు ఆరోపించారు. వివిధ సెక్షన్ల కింద అతనిపై నేరారోపణ చేశారు.












Click it and Unblock the Notifications